Director kalanjiyam requesting actress anjali to give back his money

anjali, kalanjiyam, actress anjali latest news, tamil director kalanjiyam, kalanjiyam road accident, kalanjiyam anjali news, kalanjiyam news, kalanjiyam icu, anjali hot photo shoot, anjali missing case, anjali court, anjali movies

director kalanjiyam requesting actress anjali to give back his money : After road accident the tamil director kalanjiyam requesting anjali to give back his money for health checkup

కరుణించమంటూ అంజలిని వేడుకుంటున్న డైరెక్టర్!

Posted: 08/25/2014 06:43 PM IST
Director kalanjiyam requesting actress anjali to give back his money

సినీ నటి అంజలితో తాను వ్యవహరించింది తప్పేనంటూ ఒప్పుకున్న తమిళ డైరెక్టర్... ఇప్పుడు తనను కరుణించమని ఎంతో దయనీయ స్థితిలో అభ్యర్థిస్తున్నాడు. అప్పుడు తనతో అలా వ్వవహరించకపోయి వుంటే ఇప్పుడు నేను బాగుండేవాడినని చెప్పుకుంటున్నాడు. ఆ డైరెక్టర్ మరెవ్వరో కాదు.. తమిళతెరకు పరిచయం చేసి.. ఆ తర్వాత ఆమె తనను మోసం చేసిందంటూ పలు రకాల వ్యవహారాల్లో కేసులు వేసిన వివాదాస్పద దర్శకుడు కళంజియం! అవును... నిన్నమొన్నటివరకు అంజలి ఆగ్రహావేశానికి గురయ్యే కళంజియం... ఇప్పుడు ఆమెను కరుణించమని వేడుకుంటున్నాడు.

ఇటీవలే ఒక పెళ్లికి హాజరయ్యేందుకు బయలుదేరిన డైరెక్టర్ కళంజియం.. ప్రకాశం జిల్లా ఒంగోలు వద్ద అతని కారుకి భారీ యాక్సిడెంట్ అయిన విషయం తెలిసిందే! ఈ రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించగా.. కళంజియం తీవ్రంగా గాయపడి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఇటువంటి సమయంలో తాను అంజలికి గతంలో సినిమా కోసం అడ్వాన్స్ గా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇస్తే బాగుండేదని కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఆ డబ్బులు గనుక వుండి వుంటే.. తన ఆరోగ్యాన్ని బాగుచేసుకోవడానికి పనికి వచ్చేవని.. త్వరలోనే తిరిగి కోలుకునేవాడినంటూ అతను చెప్పుకుంటున్నాడని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు.

అయితే ఈ డబ్బుకోసమే కళంజియం ఇంతకుముందు ఎంతో రాద్ధాంతం సృష్టించిన విషయం తెలిసిందే! అంజలిపై పరువునష్టం పిటిషన్ వేయడమే కాకుండా.. తమిళ నిర్మాతలు ఆమెతో కలిసి పనిచేయకూడదని సినీ అసోసియేషన్ ముందు పంచాయితీ పెట్టాడు. అంతటితో ఆగకుండా.. ఆమె పిన్ని పెట్టిన మిస్సింగ్ కేసులోనూ ఈ డైరెక్టర్ దలదూర్చి పెద్ద దుమారాన్ని రేపన విషయం కూడా విదితమే! వీరిద్దరూ కలిసి అంజలిని కొన్నాళ్లపాటు బాగానే కష్టపెట్టారు. కానీ ఇప్పుడు తనకు జరిగిన రోడ్డు ప్రమాదంతో పూర్తిగా అస్వస్థతో వున్న కళంజియం ఆమెను దయనీయస్థితిలో ఆ డబ్బులు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles