Charmi escaped from plane crash in vizag

charmi, charmi kaur latest news, charmi hot photos, charmi tweet, charmi twitter, charmi latest photo shoot, charmi indigo flight, charmi plane, charmi plane crash, charmi kaur movies

Charmi escaped from plane crash in vizag : south indian hot star charmi tweeted that.. she escaped from death

చావునుంచి బయటపడ్డ ఛార్మి!

Posted: 08/18/2014 06:04 PM IST
Charmi escaped from plane crash in vizag

ఇదేదో సినిమా షూటింగ్ నేపథ్యంలో జరిగిన ఘటనగానీ, ఏదైనా మూవీ ప్రమోషన్ లో భాగంగా ఆడిన నాటకం అయితే కాదు! తాను నిజజీవితంలోనే ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డానంటూ ఛార్మి స్వయంగా తన ట్విటర్ అకౌంట్ ద్వారా అభిమానులకు చెప్పుకుంది. సోమవారం ఉదయం ఛార్మి ఎక్కిన ఇండిగో ఫ్లైట్.. ప్రమాదానికి గురయ్యిందని ఆమె పేర్కొంది. ‘‘ఎంతో సాఫీగా సాగుతున్న మా పయనంలో అనుకోకుండా ఏమయిందో ఏమోగానీ.. ఒక్కసారిగా ఫ్లైట్ దఢేల్ మని కిందపడిపోయేలా అనిపించింది’’ అంటూ ఛార్మి వెల్లడించింది.

తన వ్యక్తిగత పనిమీద ఛార్మి సోమవారంనాడు వైజాగ్ కు ఇండిగో ఫ్లైట్ లో బయలుదేరింది. దాదాపు ప్రయాణం మొత్తం సాఫీగా సాగిన తరుణంలో ఇక ల్యాండ్ అవుతుందనగా ప్రమాదం ఎదురైంది. ఆ సంఘటన గురించి ఛార్మి విశ్లేషిస్తూ... ‘‘నేను ప్రయాణిస్తున్న ఫ్లైట్ అనుకోకుండా ప్రమాదానికి గురయ్యింది. చాలావరకు బాగానే ప్రయాణం సాగిన అనంతరం.. అనుకోకుండా ప్రమాదం ఎదురయ్యింది. ఒక్కసారిగా 100 అడుగుల కిందకు ఫ్లైట్ పడిపోయినట్లు అనిపించింది. ఆ సమయంలో నాకు చాలా భయం వేసింది. నా చేతిలో వున్న టీ కూడా కిందపడిపోయింది. చుట్టుపక్కల వున్న ప్రయాణీకులందరూ కింద పడిపోయారు. అంతే! ఇక ఇదే ఆఖరి రోజని అందరూ భావించాం. మరోసారి ఫ్లైట్ లో కుదుపులు ప్రారంభం అయ్యాయి. ఇక ప్రాణాలు గాల్లోనే కలిసిపోయాయని అనుకున్నాను. ఇదే చివరి శ్వాస అని ఫీల్ అవుతూ కళ్లు మూసుకున్నాను. కానీ ఆ దేవుడి దయవల్ల ఏమి జరగలేదు. ప్రస్తుతం నేను క్షేమంగానే వున్నాను. ఆ ప్రమాదం నుంచి తప్పించుకుని నేలపైకి ఎలా దిగామో నమ్మలేకపోతున్నా. ఇంకా ఇప్పటికీ ఆ షాక్ నుంచి తేరుకోలేకపోతున్నా’’ అంటూ ఈ బొద్దుపిల్ల తన ట్విటర్ లో పేర్కొంది.

తనకు జరిగిన సంఘటన గురించి వివరిస్తూ.. అందరికీ సూచనలు కూడా ఇచ్చింది. ‘‘జీవితంలో ఎప్పుడు, ఎలా, ఏమి జరుగుతుందో తెలియదు. అటువంటి విషయాలు గురించి ఎవ్వరూ పట్టించుకోరు కూడా! కాబట్టి జీవితం మన చేతిలో వున్నంతవరకు పూర్తిగా ఆస్వాదించాలి. కోరుకున్న కోరకలన్నీ తీర్చుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడే మాంచి కిక్కుంటుంది. రేపటి గురించి ఆలోచించుకోకుండా, బాధల్ని మరిచిపోయి ఆనందంగా గడపడంలో ఫుల్ హ్యాపీ!’’ అంటూ ఈ అమ్మడు హితువులు పలుకుతోంది. ఒక విధంగా చెప్పాలంటే.. ఛార్మి చెప్పినదాంట్లో కూడా నిజం వుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : charmi kaur  plane crash incidents  charmi kaur twitter  actress hot photo shoot  

Other Articles