Super star rajnikanth speaks about his political entry

super star rajnikanth, rajnikanth latest news, rajnikanth linga movie, linga movie schedules, linga movie shooting stills, anushka latest news, anushka shetty hot photos, sonakshi sinha latest news, sonakshi sinha hot photo shoot, sonakshi sinha hot photos, sonakshi sinha linga movie, anushka shetty linga movie

super star rajnikanth speaks about his political entry : Indian super star rajnikanth speaks about his political entry that.. If god wants to join in political then he will ready. present rajni is busy in linga movie shooting

ఆయన ఆశిస్తే.. రజనీ రాజకీయ అడుగులు వేస్తారట!

Posted: 08/18/2014 12:59 PM IST
Super star rajnikanth speaks about his political entry

భారతీయ చిత్రపరిశ్రమలోనే తనదైన ముద్ర వేసుకుని, సూపర్ స్టార్ పేరు సంపాదించుకున్న రజినీకాంత్.. చాలారోజుల తర్వాత తన రాజకీయ అడుగుల గురించి పెదవి విప్పారు. ఇన్నాళ్లవరకు రాజకీయాలకు దూరంగా వుంటూ, ఆ విషయాల గురించి చెప్పడానికి ససెమిరా అని చెబుతూ వచ్చినా ఈ సూపర్ స్టార్... ఇప్పుడు తాజాగా తన రాజకీయ రహస్యం గురించి ఆయన బయటపెట్టేశారు. ‘‘ఆయన ఆశిస్తే.. నేను రాజకీయ అడుగులు వేయడానికి రెడీ’’ అంటూ స్వయంగా ఆయనే చెప్పడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. ఇక త్వరలోనే రజనీకాంత్ రాజకీయాల్లో ప్రవేశించడం ఖాయమంటూ ప్రతిఒక్కరు గోల చేయడం మొదలుపెట్టేశారు.

ప్రస్తుతం తన ‘‘లింగా’’ షూటింగ్ లో బిజీగా వున్న సూపర్ స్టార్ రజనీ.. మంగళూరు షెడ్యూల్ లో పాల్గొనడానికి ఆయన చెన్నయ్ నుంచి బయలుదేరారు. అనంతరం మంగళూరు ఎయిర్ పోర్టుకు ఈయన చేరిన వెంటనే అక్కడున్న మీడియా జనాలు ఈయనను చుట్టుముట్టేశారు. వారు అడిగిన ప్రశ్నలకు తాపీగా సమాధానం చెబుతూ ఎక్కువసేపు గడిపారు. ఈ తరుణంలోనే ఓ పాత్రికేయుడు.. ‘‘మీరు రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారు? అసలు మీరు రావాలనుకుంటున్నారా..?’’ అని అడిగిన ప్రశ్నలకు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు... ‘‘ఆ దేవుడు అంటే నాకు చాలా ఇష్టం. ఒకవేళ నేను రాజకీయాల్లోకి రావాలని ఆయన(దేవుడు) ఆశిస్తే.. నేను ఆచరిస్తాను’’ అని తనదైన స్టయిల్ లో చెప్పారు. ఇక అంతే సంగతులు... త్వరలోనే రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నారు అంటూ ఢోలు వాయించడం మొదలుపెట్టేశారు కోలీవుడ్ మీడియా వర్గాలు!

అలాగే తన ఆరోగ్యం గురించి మాట్లాడుతూ.. ‘‘ఆమధ్య కొన్ని కారణాల వల్ల అనారోగ్యం పాలయ్యాను. దేవుడి దయవల్ల అందులోంచి క్షేమంగా బయటపడ్డాను. ఇప్పుడు ఆరోగ్యపరంగా నాకు ఎలాంటి ఇబ్బందీలేదు. షూటింగ్ లలో ఉత్సాహంగా పాల్గొంటూ బాగున్నాను’’ అని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన తన సినిమా గురించి మాట్లాడుతూ... తన పుట్టినరోజున సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తున్నారని చెప్పారు. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో వస్తున్న ‘‘లింగా’’ మూవీలో అనుష్క, సొనాక్షీ సిన్హా హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తయ్యింది. మంగళూరులో నిరవధికంగా 21 రోజులపాటు షూటింగ్ తో ఈ చిత్రం పూర్తవుతుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : super star rajnikanth  anushka shetty  sonakshi sinha  linga movie  rajnikanth politics  

Other Articles