Tamil actor simbu speaks about romance with trisha

trisha latest news, simbu latest news, trisha simbu news, trisha with simbu, trisha hot photo shoot, trisha news, trisha telugu movie, trisha tamil movie

tamil actor simbu speaks about romance with trisha : tamil actor simbu reveals the romance with trisha in tamil version yemaya chesave movie

చివరికి త్రిష కూడా శింబు చేతిలో నలిగిపోయిందా..?

Posted: 08/17/2014 05:01 PM IST
Tamil actor simbu speaks about romance with trisha

(Image source from: tamil actor simbu speaks about romance with trisha)

తమిళ ఇండస్ట్రీలో వివాదాస్పద నటుడిగా పేరు తెచ్చుకున్న శింబు వ్యవహారాల గురించి తెలియనివారు ఎవ్వరుండరు! గతంలో నయనతారతో, హన్సికతో ప్రేమాయణం నడిపినంతకాలం నడిపి.. ఆ తర్వాత కొన్ని వివాదాల కారణంగా విడిపోయారు. అప్పుడప్పుడు ఎవరో ఒకరితో ఎఫైర్స్ నడుస్తున్నాయంటూ ఇతనిపై తరుచూ రూమర్లు రావడం కామన్ అయిపోయింది. అయితే ఇప్పుడు తాజాగా మూడుపదుల భామ త్రిష కూడా ఇతని చేతిలో నలిగిపోయిందంటూ కోలీవుడ్ లో వార్తలు ఫుల్లుగా షికార్లు చేస్తున్నాయి. ఇక్కడ ముఖ్యమైన అంశం ఏమిటంటే.. ఈ విషయాన్ని స్వయంగా శింబునే మీడియాముందు తనకూ, త్రిషకు మధ్య వున్న సంబంధం గురించి విశ్లేషించి మరీ చెప్పాడు. దీంతో ఈ హీరో లవర్స్ లిస్ట్ లో త్రిష కూడా చేరిపోయిందని అందరూ చర్చించుకుంటున్నారు.

హీరో శింబు ఒక ప్రముఖ తమిళ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్య్యూ నేపథ్యంలో త్రిషకు, తనకు మధ్య వున్న గత సంబంధాల గురించి వివరించాడు. ఇందులో భాగంగానే.. ‘‘త్రిష ఎంతో కంఫర్టబుల్ గా వుండే అమ్మాయి. తనతో గడిపిన కాలం నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది. తను నాకు అన్ని విషయాల్లోనూ బాగా సహకరించింది. ఒక్క విషయంలో చెప్పాలంటే.. తనతో వున్నప్పుడ్డల్లా నేను చాలా కంఫర్టబుల్ ఫీల్ అవుతాను’’ అంటూ కుండబద్ధలు కొట్టేశాడు. అయితే ఇతను చెప్పింది తమ మధ్య వున్న వ్యక్తిగత సంబంధం గురించి కాదు... గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వీరిద్దరూ కలిసి నటించిన ‘‘విన్నైతాండి వరువాయ’’ (ఏమాయ చేశావే) సినిమా షూటింగ్ నేపథ్యంలో వీరిమధ్య వున్న అనుబంధం గురించి తెలిపాడు. కానీ వ్యక్తిగత జీవితంలో తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని క్లారిటీ ఇచ్చాడు.

ఇంటర్య్యూలో భాగంగా ఒకరు.. ‘‘మీకు ఏ హీరోయిన్ తో కలిసి నటించడం ఇష్టం’’ అని అడిగిన ప్రశ్నకు సమాధానం శింబు సమాధానం చెబుతూ.. ‘‘త్రిషతో కలిసి నటించడం చాలా కంఫర్టబుల్ గా వుంటుంది. మా ఇద్దరి మధ్య ఆన్ స్ర్కీన్ కెమెస్ట్రీ కూడా అద్భుతంగా కుదిరింది. ఆ సినిమాలో నాతో రొమాన్స్ చేసేటప్పుడు తను బెడియంలేకుండా నాన్ను అన్నివిధాలుగా సహకరించింది. తను నాకు మంచి ఫ్రెండ్ కూడా’’ అంటూ సమాధానం ఇచ్చాడు. దీంతో ఇతను ఇచ్చిన ఈ తాజా స్టేట్ మెంట్స్ ఇప్పుడు పెద్ద అనుమానాలకే తెరతీశాయి. అప్పుడు నయనతార, హన్సికలతో పీకల్లోతుదాకా ప్రేమాయణం సాగించి తరువాత వదిలేసిన శింబు.. ఇప్పుడు తాజాగా త్రిషను పట్టుకున్నాడని.. వీరిద్ధరి మధ్య ఏదో జరుగుతోందంటూ ప్రచారాలు తెగ వస్తున్నాయి.  త్రిష కూడా శింబు చేతిలో బలైపోయిందంటూ అందరూ చెప్పుకోవడం మొదలుపెట్టేశారు. మరి దీనిపై త్రిష ఎలా వ్యవహరించనుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : actress trisha  simbu  trisha simbu  telugu actresses  

Other Articles