Abhishek bachchan suggesting girls to participate in sports

abhishek bachchan, aishwarya rai bachchan, abhishek bachcha aishwarya, abhishek bachchan latest news, abhishek bachchan selfie photo, abhishek bachchan girls selfie photo

abhishek bachchan suggesting girls to participate in sports : bollywood star abhishek bachchan giving suggestions to girls and women to participate in sports quota.

అమ్మాయిలపై శ్రద్ధ చూపిస్తున్న అభిషేక్ బచ్చన్

Posted: 08/13/2014 11:02 AM IST
Abhishek bachchan suggesting girls to participate in sports

బాలీవుడ్ బిగ్ బీ తనయుడు, ఛోటా బచ్చన్ గా పేరు తెచ్చుకున్న అభిషేక్ బచ్చన్... ఈమధ్యకాలంలో అమ్మాయిలపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నట్టు కనిపిస్తోంది. నిన్నమొన్నటివరకు సినిమాల షూటింగ్ లతో బిజీగా వున్న ఈ నటుడు.. తాజాగా అమ్మాయిల మీద దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఇది హాట్ టాపిక్ గా మారిపోయింది.

ఇటీవలే ఇండియన్ కబడ్డీ లీగ్ లో పింక్ పాంథర్స్ జట్టును కొనుగోలు చేసిన అభిషేక్ బచ్చన్... దాని ప్రచార కార్యక్రమంలో భాగంగా బీహార్ లో పర్యటించాడు. ఈ సందర్భంగా ఆయన మగధ మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఇందులో భాగంగానే ఆయన అక్కడున్న విద్యార్థునులతో ముచ్చటిస్తూ.. వారికి సంబంధించి కొన్ని సలహాలను ఇచ్చాడు. అమ్మాయిలు కూడా అబ్బాయిల్లాగా క్రీడల మీద ఆసక్తి పెంచుకోవాలని.. తమ ప్రతిభను కనబరచాలని ఆయన పేర్కొన్నాడు. ఈ విధంగా ఆయన అమ్మాయిల మీద శ్రద్ధ చూపిస్తూ.. వారికి క్రీడల మీద ఆసక్తి కలిగేలా సలహాలు ఇస్తున్నాడు.

అలాగే.. బీహార్ లో వున్నవారు తన కుటుంబం మీద చాలా అభిమానాన్ని వ్యక్తం చేశారని... మరోసారి బీహార్ కు వచ్చేటప్పుడు తన భార్య ఐశ్వర్యరాయ్ ను కూడా తోడుగా తీసుకొస్తానని ఆయన హామీ ఇచ్చారు. తాను బీహార్ నుంచి వెళ్లేముందు అక్కడున్న అమ్మాయిలతో కలిసి ఒక సెల్ఫీ ఫోటో తీసుకుంటానని.. దానిని తన భార్యను చూపిస్తానని చెబుతూ.. అక్కడున్న విద్యార్థినుల్లో సంతోషాన్ని నింపినట్టు వారు తెలుపుతున్నారు. అభిషేక్ చెప్పినట్లు సదరు సెల్ఫీ ఫోటోను ట్విటర్ లో పోస్ట్ చేసి.. భారత భవిష్యత్తు మహిళల సత్తాపైనే ఆధారపడి వుందని... వారిని కూడా అన్నిరంగాల్లో ప్రోత్సాహించే బాధ్యత మనందరిపై వుందని ఆయన వ్యాఖ్యలు చేశాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles