Shruti hassan bellam konda gif

shruti hassan latest news, shruti hassan hot photo shoot, shruti hassan hot photos, shruti hassan romance alludu, shruti hassan romance bellamkonda srinivas, director boyapati sreenu latest news, producer bellam konda suresh, hero bellamkonda srinivas

Shruti hassan romance alludu seenu hero bellam konda srinivas next movie : tollywood hot actress shruti hassan to romance with bellam konda srinivas in his next movie which is produced by her father bellamkonda suresh. boyapati srinu will be direct this movie.

అల్లుడుతో శృతిమించుతూ బుక్కయింది!

Posted: 08/08/2014 12:32 PM IST
Shruti hassan bellam konda gif

అప్పుడెప్పుడో హాట్ బ్యూటీ శృతి హాసన్ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి చట్టాపట్టాలేసుకు తిరుగుతూ అడ్డంగా బుక్కయ్యిందని రకరకాలుగా వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ కేవలం రూమర్సని.. అనవసరంగా తనపై నిందమోపుతున్నారని శృతి క్లారిఫికేషన్ ఇచ్చేసింది. ఇప్పుడు తాజాగా ‘‘అల్లుడు’’తో కలిసి శృతిమించుతూ బుక్కయిందని మరో వార్త టాలీవుడ్ లో షికార్లు చేస్తోంది. ఆ అల్లుడు మరెవరో కాదు.. నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు డెబ్యూ సినిమా ‘‘అల్లడు శీను’’గా పరిచయమైన బెల్లంకొండ శ్రీనివాస్!

సురేష్ తన తనయుడు శ్రీనివాస్ ను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేయాలనే ప్రయత్నంలో పూర్తిగా మునిగిపోయినట్టు కనిపిస్తాడు. అందుకే... మొదటి చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించాడు. మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ తో పాటు సమంతా, తమన్నా, ప్రకాష్ రాజ్ వంటి స్టార్లకు భారీ రెమ్యునరేషన్లు సమర్పించుకుని మరీ ఆ సినిమాను తెరకెక్కించాడు. భారీగా నిర్మించినప్పటికీ ఆ సినిమా అంతగా ప్రేక్షకాదరణ పొందలేకపోయింది కానీ.. హీరో శ్రీనివాస్ మాత్రం తన ప్రతిభతో అందరిని ఆకట్టుకున్నాడు. మొదటి చిత్రం అయినప్పటికీ పాతవాడిలా అందరితో మెలిగిపోతూ అద్భుత నటనను కనబరిచాడు. దీంతో ఇతని క్రేజ్ టాలీవుడ్ లో పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు.

ఇదిలావుండగా వుండగా.. బెల్లంకొండ తన తనయుడి రెండో చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తున్నాడు. ఈ సినిమాను కూడా భారీ బడ్జెట్ తోనే నిర్మాంచాలని ప్లాన్ చేసుకున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకోసం భారీ పారితోషికాన్ని సమర్పించి బోయపాటి శ్రీనుని దర్శకుడిగా బుక్ చేసుకున్న సురేష్... కథానాయికగా శృతిహాసన్ ను బుక్ చేసినట్లు తాజా సమాచారం వెలువడుతోంది. అందుకు ఆమెను భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తూ సినిమాలో నటించాల్సిందిగా సంప్రదించిన వెంటనే.. అందుకు ఆమె డేట్స్ ఇచ్చేసిందని టాక్ వినిపిస్తోంది. అయితే ఇంకా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles