Mega star chiranjeevi special guest meelo evaru koteeswarudu final episode

meelo evaru koteeswarudu show, megastar chiranjeevi, nagarjuna latest news, chiranjeevi nagarjuna, nagarjuna meelo evaru koteeswarudu, chirnajeevi nagarjuna meelo evaru koteeswarudu, kaun banega crorepati, chiranjeevi special guest

mega star chiranjeevi special guest meelo evaru koteeswarudu final episode : tollywood megastar - former central minister chiranjeevi is coming to meelo evaru koteeswarudu show as special guest in the final episode which is to be telecast on august 7th

‘‘చిరు’’ రాకతో దుకాణం బంద్ చేసుకున్న నాగార్జున!

Posted: 08/06/2014 01:21 PM IST
Mega star chiranjeevi special guest meelo evaru koteeswarudu final episode

టాలీవుడ్ మెగాస్టార్, మాజీ కేంద్రమంత్రి చిరంజీవి అడుగుపెట్టిన వేళ గ్రీకువీరుడు నాగార్జున తన దుకాణాన్ని బంద్ చేసుకుంటున్నాడు. నిన్నమొన్నటివరకు వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతున్న కారణంగా ‘‘మీలో ఎవరు కోటీశ్వరుడు’’ షోతో బుల్లితెరపై తనదైన ప్రత్యేక ఇమేజీని క్రియేట్ చేసుకున్న నాగ్... ఇప్పుడు ఆ దుకాణాన్ని కూడా బంద్ చేసుకుంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న చాలామంది బుల్లితెర ప్రేక్షకులు తమతమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు.

బాలీవుడ్ దిగ్గజ హీరో అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న ‘‘కౌన్ బనేగా కరోడ్ పతి’’కి స్ఫూర్తిగా తెలుగులో ‘‘మీలో ఎవరు కోటీశ్వరుడు’’ వచ్చిన సంగతి తెలిసిందే! ఇందులో కింగ్ నాగార్జున హోస్ట్ చేసి బుల్లితెర ప్రేక్షకుల నుంచి వినూత్న ఆదరణను సంపాదించుకున్నాడు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో మంచి ఆదరణ పొందడంతోపాటు విదేశాల్లో వున్న తెలుగువారిని కూడా ఈ షో ఆకట్టుకుంది. ‘‘మాటీవీ’’లో ప్రసారమయ్యే ఈ షో.. అన్ని బుల్లితెర షోలను వెనక్కు నెట్టేసి నెంబర్ 1 స్థానాన్ని కూడా కైవసం చేసుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారి కలలను నిజం చేస్తూ.. వారి జీవితానుభవాలను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనతను సంపాదించుకుంది.

జూన్ 9వ తేదీన ప్రారంభమైన ఈ గేమ్ షో.. నిర్వాహకులు కాంట్రాక్టు ప్రకారం మొత్తం 40 ఎపిసోడ్ లను నిర్మించింది. దాదాపు 11 లక్షలమంది ఈ షోలో పాల్గొనేందుకు ఆసక్తి చూపించడం గమనించదగిన విషయం. ట్యామ్ మానిటరింగ్ లెక్కలప్రకారం 1.74 కోట్లు టీవీ వ్యూయింగ్ యూనివర్స్ అయితే.. 1.38 కోట్ల మందికి ఈ షో చేరింది. ఇంతటి ప్రజాదారణ పొందిన ఈ షో ఇప్పుడు తుదిదశకు చేరుకుంది. ఈ షో చివరి ఎపిసోడ్ నాడు మన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వస్తున్నారు. దీంతో అద్భుత నటులమధ్య ఈ షో ముగియనుందని అందరూ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. చిరు ముఖ్య అతిథిగా వచ్చిన ఈ షో ఎపిసోడ్ ను ఈనెల 7వ తేదీన టెలికాస్ట్ చేయనున్నట్టు నిర్వాహకులు పేర్కొంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles