Rakul preet singh bagged anushka shetty credit tollywood

rakul preet singh latest news, rakul preet singh, anushka shetty latest news, rakul preet singh anushka, anushka hot photo shoot, rakul preet singh hot photo shoot, tollywood movie news, telugu news, telugu movie news, telugu political news, political news, anushka shetty comments rakul preet singh, rakul preet singh comments anushka

Rakul preet singh bagged anushka shetty credit tollywood : Venkatadri express movie debutant actress rakul preet singh getting good response and bagged more offers in telugu industry like anushka shetty

అనుష్క సాధించిన క్రెడిట్ ని రకూల్ ప్రీత్ లాగేసుకుంది!

Posted: 08/06/2014 10:38 AM IST
Rakul preet singh bagged anushka shetty credit tollywood

‘‘సూపర్’’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అనుష్క... మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కున్నప్పటికీ తరువాత టాలీవుడ్ బొమ్మాళీగా స్థిరపడిపోయింది. అందరినీ ఆకట్టుకునేలా అందమైన రూపాన్ని కలిగివున్న ఈ అమ్మడు.. మూడుపదుల వయస్సు దాటినా కూడా అభిమానుల్లో ఇంకా క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఈమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ని చూసే నిర్మాతలు ఈమెతో భారీ బడ్జెట్ తో కూడిన లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేయడానికి సిద్ధపడుతారు. ఈ కోవలోనే ‘‘అరుంధతి, వర్ణ, పంచాక్షరి’’ వంటి చిత్రాల్లో నటించింది. తాజాగా ‘‘బాహుబలి, రుద్రమదేవి’’ వంటి భారీ ప్రతిష్టాత్మక చిత్రాల్లోనూ నటిస్తోంది. దీంతో సౌత్ ఇండస్ట్రీలో వున్న హీరోయిన్లందరిలోనూ ఈమె సాధించిన క్రెడిటే వేరని సినీ ప్రముఖులందరూ అభిప్రాయపడుతున్నారు.

ఇదిలావుండగా... ‘‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’’ చిత్రంతో తెలుగు చిత్రపరిశ్రమకు ఎంట్రీ ఇచ్చుకున్న రకూల్ ప్రీత్ సింగ్.. ఆ సినిమాతో భారీ విజయాన్ని అందుకుని ‘‘గోల్డెన్ లెగ్’’గా పేరు సంపాదించుకుంది. దీంతో ఈమెకు వెనువెంటనే తెలుగులో ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. కేవలం తెలుగులోనే కాదు... కోలీవుడ్, బాలీవుడ్ లలో సైతం ఈ అమ్మడు దూసుకుపోతోంది. వాటి గురించి కొద్దిసేపు పక్కనపెడితే... ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ అమ్మడికి భారీ రేంజులో గౌరవం దక్కుతోంది. ఏ విధంగా అయితే అనుష్క టాలీవుడ్ లో లాంగ్ ఇన్నింగ్స్ కొనసాగించి మంచి క్రెడిట్ ను సాధించిందో.. అలాగే రకూల్ ప్రీత్ సింగ్ కూడా తెలుగు చిత్రసీమలో కొనసాగుతుందని టాలీవుడ్ లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.

మంచి లుక్స్, పొడుగ్గా, సెక్సీగా వున్న రకూత్ ప్రీత్ సింగ్ ని చూసి దర్శకనిర్మాతలందరూ పిచ్చోళ్లయిపోతున్నారని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. చీరకట్టు నుంచి ఫ్యాషన్ డ్రెస్సుల వరకు అన్నింటిలో ఒదిగిపోవడంతోపాటు తెలుగు కూడా చాలా స్పీడుగా నేర్చుకోవడంతో అందరూ ఈమె మీద దృష్టి పెట్టారు. ‘‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’’ సినిమా షూటింగ్ సమయంలో ఈ భామ సందర్భాలను బట్టి తెలుగు చక్కగా మాట్లాడేదని సదరు మూవీ యూనిట్ సభ్యులే పేర్కొన్నారు. ఈ ఆరడుగుల భామలో ఆకట్టుకునే ఫీచర్స్ చాలానే వున్నాయని ప్రతిఒక్కరు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈమెను అనుష్కతో పోలుస్తూ.. ఇంతవరకు అనుష్క సాధించిన క్రెడిట్ ని ఈ అమ్మడు లాగేసుకుందని చర్చించుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles