Pawan kalyan writing script and screenplay for gabbar singh 2 movie specially for fans

pawan kalyan, pawan kalyan latest news, pawan kalyan in gabbar singh movie, pawan kalyan in gabbar singh 2 movie, pawan kalyan gabbar singh 2 movie news, gabbar singh 2 movie news, pawan kalyan writing script and screenplay, pawan kalyan latest press meet

pawan kalyan writing script and screenplay for gabbar singh 2 movie specially for fans

అరెవో ‘‘గబ్బర్ సింగ్’’కే ఫౌజియో.. నికాలో స్ర్కిప్ట్ ఔర్ లిఖో స్టోరీ!

Posted: 07/31/2014 10:42 AM IST
Pawan kalyan writing script and screenplay for gabbar singh 2 movie specially for fans

(Image source from: pawan kalyan writing script and screenplay for gabbar singh 2 movie specially for fans)

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘‘గబ్బర్ సింగ్’’ సినిమాతో టాలీవుడ్ ఎన్ని రికార్డులను బద్దలుకొట్టిందో అందరికీ తెలిసిన విషయమే! అందులో పవన్ చెప్పిన ‘‘నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది’’ అనే డైలాగ్ ఇప్పటికీ గల్లిగల్లీల్లో మారుమోగుతూనే వుంది. అందులో ఆయన నటించిన తీరు, నడకను ఇప్పటికీ అభిమానులు ఫాలో అవుతూనే వున్నారు. సంచలనాలకే మారుపేరుగా నిలిచిపోయిన ఆ ‘‘గబ్బర్ సింగ్’’ సినిమాకు సీక్వెల్ వస్తుందన్న విషయం తెలియగానే అభిమానుల్లో దానిమీద అంచనాలు ఓ భారీ రేంజ్ లోనే పెట్టుకున్నారు. పవన్ సినిమా ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అటు టాలీవుడ్ ప్రేక్షకజనాలు, ప్రముఖులు కూడా ఈ సినిమామీద చాలా ఆశలే పెట్టుకున్నారు.

వారందరి ఆశల్ని అందుకోవడానికి, అభిమానుల్ని నిరాశపరచకుండా ‘‘గబ్బర్ సింగ్-2’’ మూవీ యూనిట్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని తాజా సమాచారం! గత సినిమాలో వుండే హంగులను మార్చేసి, సరికొత్త ఒరవడితో తెరకెక్కించాలనే ప్రయత్నాల్లో మునిగిపోయారు. ముఖ్యంగా ఈ మూవీ స్ర్కిప్ట్ లో పవన్ కల్యాణ్ జోక్యం చేసుకుని, స్టోరీ లైన్ సరికొత్తగా వుండేలా ప్లాన్ చేస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. సంపత్ నంది రాసిన ఈ చిత్రం స్ర్కిప్ట్ కు పవన్ కల్యాణ్ తుది మెరుగులు దిద్దుతున్నారు. గతంలో కూడా ఈయన ‘‘జానీ’’ సినిమాలో స్ర్కిప్ట్, స్ర్కీన్ ప్లే ను మార్చి సరికొత్తగా కనిపించినప్పటికీ.. ఆ సినిమా అంతగా సక్సెస్ కాలేకపోయింది. కానీ ఈసారి మాత్రం చాలా భిన్నంగా వుండేలా పవన్ తన రచనకు పని చెప్పాడని యూనిట్ సభ్యులు పేర్కొంటున్నారు.

ప్రస్తుతం ‘‘గోపాల గోపాల’’ సినిమా షూటింగ్ లో బిజీగా వున్న పవన్... షూటింగ్ కంప్లీట్ అయిపోగానే వెంటనే ‘‘గబ్బర్ సింగ్-2’’ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారు. గతంలో ఈ మూవీ షూటింగ్ క్యాన్సిల్ అయినట్టు వార్తలను పూర్తిగా ఖండించి, ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ అక్టోబర్ 2 నుంచి ప్రారంభిస్తామని దర్శకనిర్మాతలు స్పష్టం చేశారు. ఈలోపు స్ర్కిప్ట్ పనులను పవన్ దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ చిత్రానికి కూడా దేవీశ్రీప్రసాద్ తన బాణీలను అందించబోతున్నాడు. అయితే హీరోయిన్ విషయంలో మాత్రం ఇంతవరకు క్లారిటీ రాలేదు. ఇంకా టెక్నీషియన్లు, తదితర వివరాలు కూడా త్వరలోనే వెల్లడించనున్నట్టు యూనిట్ సభ్యులు పేర్కొంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles