Chiranjeevi in robo sequel movie

director shankar to take chiranjeevi as lead role in robo sequel movie in the place of rajnikanth, megastar chiranjeevi latest news, chiranjeevi latest movie, chiranjeevi 150 movie, director shankar news, kamal hassan latest news, kamal hassan with chiranjeevi, kamal hassan with rajnikanth, kamal hassan with director shankar, chiranjeevi in robo sequel movie, director shankar with chiranjeevi

director shankar to take chiranjeevi as lead role in robo sequel movie in the place of rajnikanth

‘‘రోబో’’ సీక్వెల్ లో చిందేస్తున్న చిరు!

Posted: 07/26/2014 11:58 AM IST
Chiranjeevi in robo sequel movie

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, ఏస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘‘రోబో’’ సినిమా ఎన్ని రికార్డులను బద్దలు కొట్టిందో అందరికీ తెలిసిన విషయమే! దాదాపు 120 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేశారు. అన్ని రంగాల్లోనూ ఈ సినిమా భారీ కలెక్షన్లను రాబట్టుకుంది. సౌత్ ఇండస్ట్రీలోనే ఒక వారాంతంలో 100 కోట్ల మార్క్ ను సొంతం చేసుకున్న మొట్టమొదట సినిమా కూడా ఇదే! ఇంత భారీ రేంజిలో ఈ సినిమా సక్సెస్ అవ్వడం వల్ల దీనికి సీక్వెల్ తీయాలని శంకర్ అప్పుడే నిర్ణయించుకున్నాడు. అయితే తాను వేరే ప్రాజెక్ట్ కు కమిట్ అవ్వడం వల్ల అది అయిపోయిన అనంతరం తెరకెక్కిస్తానని ప్రకటించాడు.

ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘‘మనోహరుడు’’ చివరి దశకు చేరుకుంది. దీంతో అతను ‘‘రోబో’’ సీక్వెల్ తీసేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తున్నాడు. ‘‘రోబో’’లో ద్విపాత్రాభినయం పోషించిన రజనీయే ఈ సీక్వెల్ హీరోగా, ఆమీర్ ఖాన్ విలన్ గా నటిస్తున్నట్టు అప్పట్లో ఖరారు చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్యం అంతగా సహకరించడంలేదని... అటువంటి సమయంలో యాక్షన్ ఓరియెంటెడ్ సినిమా చేయడానికి కష్టమవుతుందన్న అభ్యంతరాన్ని రజనీ వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

దీంతో ఈ సినిమాలో లీడ్ రోల్ కు రజనీకి తగ్గట్టు ఎవరున్నారా అని భావించిన నేపథ్యంలో శంకర్ కమల్ హాసన్ ను సంప్రదించాడట! గతంలో రోబో సినిమాలోనూ కమల్ నే హీరోగా తీసుకోవాలని భావించి అతనిని సంప్రదిస్తే.. అప్పట్లో డేట్స్ కుదరడం లేదని ఆయన తిరస్కరించాడు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో ఆయనయితేనే బాగుంటారనే ఉద్దేశంతో శంకర్ మరోసారి కమల్ ను సంప్రదించి, ఈ ప్రాజెక్ట్ గురించి వివరించాడని సమాచారం! కానీ ప్రస్తుతం రెండు భారీ చిత్రాల షూటింగ్ లో బిజీగా వున్న కమల్ కి డేట్స్ అడ్జస్ట్ కావడం లేదని ఆయన కూడా తప్పుకున్నాడట!

megastar-chiranjeevi

ఇక చివరగా మెగాస్టార్ చిరంజీవిని ఈ సినిమాలో లీడ్ రోల్ చేయాల్సిందిగా సంప్రదించమని రజనీ, శంకర్ కు రెకమెండ్ చేశారని తాజాగా వెలువుడుతున్న వార్తల! సౌత్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్లుగా వెలుగుతున్న రజనీ, కమల్ తరువాత ఆ స్థాయి రేంజున్న హీరో చిరంజీవియే! దీంతో రజనీ, శంకర్ ను చిరుని రెకమెంట్ చేయమని రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. మరి రజనీ మాటకు విలువిచ్చి శంకర్, మెగాస్టార్ ను సంప్రదిస్తాడా..? ఒకవేళ సంప్రదిస్తే చిరు అందుకు ఒప్పుకుంటాడా..? ఈ విషయాలన్ని తేలాలంటే మరికొద్దిరోజుల వరకు ఆగాల్సిందేనని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి.

ఒకవేళ అన్ని సజావుగా జరిగి శంకర్ చిరుని సంప్రదించి, అందుకు చిరు ఓకే అంటే మాత్రం... మెగాస్టార్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో కూడిన మొట్టమొదటి సినిమా ఇదే అవుతుంది. పైగా ఇటువంటి సాంకేతిక పరిమాణాలతో తెరకెక్కుతున్న సినిమాలో చిరు నటించడం ఇదే ఫస్ట్! ఇందులో విలన్ పాత్రలో ఆమీర్ ఖాన్ కూడా వుండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మరో రికార్డుగా నిలిచిపోతుంది. అయితే హీరోకోసం డైలామాలో వున్న శంకర్ ఎవరినీ ఫైనల్ చేస్తాడో ఇంతవరకు తెలియదు. వీటికి సంబంధించిన వార్తలు త్వరలోనే వెల్లడి కానున్నాయని యూనిట్ వర్గాలు తెలుపుతున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles