Priyanka chopra mary kom movie trailer released

priyanka chopra latest movie mary kom trailer released, priyanka chopra in mary kom, marry kom movie trailer, marry kom movie news, marry kom movie trailer latest news, marry kom movie photos, priyanka chopra in marry kom, priyanka chopra news

priyanka chopra latest movie mary kom trailer released

ఒళ్లు గగుర్పొడిచేలా అదరగొట్టిన ప్రియాంక!

Posted: 07/23/2014 04:34 PM IST
Priyanka chopra mary kom movie trailer released

బాలీవుడ్ లో ఇప్పటివరకు గ్లామర్ పాత్రలు చేసుకుంటూ దూసుకుపోయిన ప్రియంకా చోప్రా.. ఇప్పుడు అందుకు పూర్తిభిన్నంగా తన తాజా చిత్రంలో కనిపించబోతోంది. ఒలంపిక్స్ బ్రాంజ్ మెడల్ విజేత అయిన ఎంసీ మేరీకోమ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘‘మేరీ కోమ్’’ చిత్రంలో ప్రియాంక చోప్రా డీ-గ్లామర్ గా కనిపించడమే కాకుండా... తన బాడీని ఫిట్ గా మార్చుకుంది. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్, టీజర్లు కూడా ఇంతకుముందే రిలీజయ్యాయి. అందుకు ఈమెకు ప్రతిఒక్కరు చాలా బాగున్నావంటూ అభినందనలు కూడా తెలిపారు.

ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు సంబంధించి 2:55 సెకన్ల నిడివి గల ట్రైలర్ రిలీజైంది. ఈ ట్రైలర్ ను కనువిందు చేసిన కొందరు బాలీవుడ్, టాలీవుడ్ హీరోలు ‘‘ఒళ్లు గగుర్బొడిచేలా ప్రియాంక ఇందులో కనువిందు చేసింది. హ్యాట్సాఫ్ టు యూ’’ అంటూ ట్వీట్లు కూడా చేశారు. అలాగే సినీ అభిమానులను రోమాలు నిక్కబొడిచే విధంగా, ఎంతో ఇన్స్పిరేషనల్ గా వుందంటూ కితాబు ఇవ్వడంతోపాటు.. బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతుందని అందరూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

సినిమా కథాంశం ప్రకారం... ఎక్కడో మారుమూల గ్రామంలో ఒక పేద కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఎన్నో కష్టాలను ఎదుర్కుంటుంది. తనతో జరుగుతున్న అన్యాయాన్ని, తనను తాను కాపాడుకోవడానికి ఆమె కఠోర శ్రమతో బాక్సింగ్ నేర్చుకుంటుంది. ఎన్ని అడ్డంకులు, అనుమానాలు ఎదురయినా... వాటిని పట్టించుకోకుండా బాక్సింగ్ నే వృత్తిగా మలుచుకుని ముందుకు సాగిపోతుంది. అలా ముందడుగు వేసిన ఆ అమ్మాయి... చరిత్రలోనే రికార్డు సృష్టిస్తుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles