Women organization fires on priya anand for drinking alcohol

women organization fires on priya anand for drinking alcohol, priya anand latest news, priya anand hot photos, priya anand latest movie adimaanam, priya anand drunks in adimaanam movie, women organization fires on priya anand, priya anand movies list, women organizations in chennai, movie theatres in chennai, priya anand hot photo shoot, priya anand latest photo shoot

chennai women organization fires on actress priya anand for drinking alcohol

ప్రియాఆనంద్ పై చీపురెత్తిన మహిళాసంఘాలు

Posted: 07/17/2014 03:55 PM IST
Women organization fires on priya anand for drinking alcohol

ఎప్పుడో ఒకసారి అరకొర సినిమాలు చేసుకుంటూ కాలం గడుపుతున్న ప్రియా ఆనంద్... ఇప్పుడు తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. మగాడిలాగా మందేసి, చిందేసిన ఈ భామ... తాను చేసిన తప్పును తెలుసుకుని, తప్పయిపోయిందంటూ సంజాయిషీ ఇచ్చుకుంటుంది. ఆడవాళ్ళకు ఎంతో గౌరవం వున్న ఈ సమాజంలో... ఇలా మందేసి, చిందేస్తే సాటి మహిళ పరువు ఏమవుతుంది..? నలుగురిలో తలెత్తుకుని తిరగ్గలమా..? అసలు సిగ్గనేది వుందా..? లేదా..? అంటూ మహిళా సంఘాలు ఆమె మీద విరుచుకుపడుతున్నాయి.

ప్రియా ఆనంద్ కు రాకరాక వచ్చిన ‘‘అదిమానం’’ సినిమాలో దర్శకుడు డిమాండ్ చేసిన విధంగా ఒక సన్నివేశంలో మందేసి, చిందేసిన అమ్మాయిలా నటించింది. ‘‘దర్శకుడు సన్నివేశం ప్రకారం అక్కడ మందు కొట్టడం చాలా అవసరం. అందుకే మందు కొట్టేశాను’’ అంటూ గొప్పలు చెప్పుకుంటుంది ఈ అమ్మడు. అయితే ఈ విషయం కోలీవుడ్ లో ఒక దుమారంగా మారిపోయింది. అక్కడున్న కొందరు సంప్రదాయవాదులు, మహిళాసంఘాల వాళ్లు ప్రియా ఆనంద్ పై గుర్రుగా వున్నారని సమాచారం! ఒక అమ్మాయి మందేసి, చిందేసిన సన్నివేశాల్లో నటించడం వల్ల అది యూత్ పై చెడు ప్రభావం చూపుతుందని... అటువంటి సినిమాలను అసలు థియేటర్లలో ఆడనివ్వకుండా అడ్డుపడాలని సదరు మహిళాసంఘాలు భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ప్రియా ఆనంద్ పుట్టి, పెరిగింది పాశ్చాత్య కల్చర్ లో కాబట్టి ఆమెకు ఇటువంటి మందు సన్నివేశాల్లో నటించడం కొత్తేమీ కాదు. కానీ చెన్నై నగరవాసులు మాత్రం ఇటువంటి పాశ్చాత్య కల్చర్ కి ఇంకా అలవాటు పడలేదు. దీంతో వారికి ఈ విషయం చిర్రెత్తుకొచ్చేలా చేసింది. మొన్ననే ఒక జడ్జీ లుంగీ కట్టుకుని పబ్ లో ప్రవేశిస్తే.. అది ఇంతవరకు రచ్చ జరుగుతూనే వుంది. గతంతో ఖుష్బూ కూడా పెళ్లికి ముందు సెక్స్ చేస్తే తప్పు కాదంటూ సంచలనాలను సృష్టించి, సమస్యలను కొని తెచ్చుకుంది. ఇప్పుడు ఈ అమ్మడి పరిస్థితి ఏమవుతుందా అని ప్రతిఒక్కరు దిగులుగా చూస్తున్నారని చెబుతున్నారు. మరి తమిళతంబీలు ఈ సన్నివేశానికి ఎలాంటి రియాక్షన్ ఇస్తారో..? ప్రియాకి మంచి మార్కులు వేస్తారా..? లేక సమాజానికి విరుద్ధంగా నటించిందని ఇండస్ట్రీ నుంచి వేటు వేస్తారా..? వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles