Ram gopal varma released ice cream movie 2 first look

Ram Gopal Varma released ice cream movie 2 first look, ram gopal varma New movie title as Ice cream 2, ram gopal varma latest news, ram gopal varma new movie, ram gopal varma new movie title release, ram gopal varma ice cream 2, ice cream 2 movie poster, ice cream 2 movie first look, ice cream 2 movie news, ice cream movie news

Ram Gopal Varma released ice cream movie 2 first look

మరోసారి ఐస్ క్రీమ్ ను పంచుతున్న వర్మ

Posted: 07/16/2014 12:55 PM IST
Ram gopal varma released ice cream movie 2 first look

మొన్నటివరకు వరుస సీక్వెల్స్ తో బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఆటాడించిన రాంగోపాల్ వర్మ... ఇప్పుడు అదే ఫార్ములాను ఫాలో అవుతూ టాలీవుడ్ మీద పటినట్టు కనిపిస్తోంది. తన సినిమాలు హిట్టా, ఫట్టా అనే అంశాలు పట్టించుకోకుండా వరుసగా సినిమాలు తీసుకుంటూ పోతున్నాడు. ‘‘మార్కెట్ స్ట్రాటజీని బట్టి సినిమాలు తీయడమే నా పని’’ అని గతంలో చెప్పుకున్న వర్మ... అన్నట్లుగానే రకరకాల చిత్రాలను తెరమీదకు తీసుకొస్తున్నాడు.

‘‘నా సినిమాలు హిట్ అవుతాయా, ఫ్లాప్ అవుతాయా అనే అంశాలు నాకు ముఖ్యం కాదు... నిర్మాతలకు డబ్బులు తెచ్చానా..? లేదా..? అనేదే నాకు ముఖ్యం. ఆ నిర్ణయంతోనే నేను ఐస్ క్రీమ్ సినిమా తీశాను. ఆ సినిమా రిలీజ్ కు ముందే మంచి ప్రాఫిట్ వచ్చింది. ఒక్కరోజు ఆడితే చాలు.. ప్రాఫిట్ మొత్తం చేతికి అందేలా ప్లాన్ చేసి తీసిన సినిమా ఇది. నేను తీసిన సినిమాలు, తీయబోయే సినిమాలు దాదాపు ఇలాగే వుంటాయి’’ అని రాంగోపాల్ వర్మ తన కాన్ఫిడెన్స్ గురించి చెప్పుకున్నాడు.

రాంగోపాల్ వర్మ బ్రాండ్ పేరు గురించి తెలియని వారు ఎవ్వరూ లేరు. ఆయన ఏదైనా ఒక సినిమాను తీస్తున్నాడు అంటే... ఆ సినిమాకు తెలియకుండానే ఫ్రీగా పబ్లిసిటీగా వచ్చేస్తుంది. దేశం మొత్తం మీద ఒక పెద్ద దుమారంగా మారిపోతుంది. దీంతో నిర్మాతకు ఎటువంటి ఖర్చు లేకుండా తన సినిమాకు ఫ్రీగా పబ్లిసిటీ వచ్చి పడుతుంది. ప్రేక్షకులు ఈయన సినిమాలో ఏదో ఒక కొత్తదనం వుంటుందన్న ఆశతో ఖచ్చితంగా సినిమాకు వెళ్తారు. అందువల్లే నిర్మాతలు రాంగోపాల్ వర్మతో సినిమాలు తీయడానికి ఆసక్తి చూపుతారు.

ఇలా ఈయన తీసిన సినిమాలు కోకొల్లలు. అందులో భాగంగానే తాజాగా వచ్చిన ఐస్ క్రిమ్ సినిమా. ఈ సినిమాకు సంబంధించి చాలా వివాదాలే చెలరేగాయి. అవి ఇంకా సమసిపోయాయో లేదో గానీ... ఇంతలోనే రాంగోపాల్ వర్మ మరో బాంబ్ ను పేల్చేశాడు. ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఐస్ క్రీమ్ మూవీకి సీక్వెల్ మొదలుపెట్టేశాడు. ఆ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ ను కూడా మీడియాకి రిలీజ్ చేశాడు. ఈ పోస్టర్ ఎంతో సెక్సీగాను, భయంకరంగాను అమర్చాడు వర్మ!

ఈ పోస్టర్ ను చూస్తుంటే... సెక్సీగా వుండే అమ్మాయి మోహంలో దెయ్యం చిక్కుకున్నట్టు కనిపిస్తోంది. దీనికి ‘‘ఐస్ క్రీమ్ 2’’ అనే టైటిల్ పెట్టి, దానికింద ట్యాగ్ లైన్ గా సెప్టెంబర్ విడుదల అని రిలీజ్ ఎప్పుడో చెప్పేశాడు. సినిమా షూటింగ్ మొదలయ్యిందో లేదో తెలియదు కానీ... అప్పుడే రిలీజ్ డేట్ విడుదల చేసి, అందరికీ సవాల్ విసురుతున్నాడు సంచలనాల దర్శకుడు. ఏదైమైనా... రాంగోపాల్ వర్మ మామూలోడు కాదంటూ సివీ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. మరీ ఈ సినిమా ఎన్ని వివాదాలకు గురవుతుందో...? వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles