Ra ra krishnaiah movie collections

Ra Ra Krishnaiah movie collections, rara krishnaiah movie news, rara krishnaiah movie collections, rara krishnaiah movie collections in 10 days, rara krishnaiah movie first week collections, hero sandeep kishan latest news, regina latest photos, regina hot photos in rara krishnaiah movie, sandip kishan and regina in rara krishnaiah movie

Ra Ra Krishnaiah movie collections

కృష్ణయ్య రొమాన్స్ కు ఇంత కలెక్షనా..?

Posted: 07/12/2014 11:31 AM IST
Ra ra krishnaiah movie collections

(Image source from: Ra Ra Krishnaiah movie collections)

‘‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’’ సినిమాతో సక్సెస్ ఫుల్ హీరోగా పేరు సంపాదించిన హీరో సందీప్ కిషన్... అటు సినీ పరిశ్రమలోనూ, ఇటు అభిమానుల్లోనూ ఆయన మీద భారీ అంచనాలు పెరిగాయి. తన తర్వాతి సినిమాలు కూడా చాలా అద్భుతంగా వస్తాయని, చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల హీరోగా త్వరలోనే పేరు సంపాదించుకుంటారని ప్రతిఒక్కరు ఈయన మీద గంపెడాశలు పెట్టుకున్నారు కూడా! కానీ తాజాగా విడుదలయిన ఈయన చిత్రం ‘‘రారా కృష్ణయ్య’’ మాత్రం అందరి ఆశల్ని అడియాశలు చేసిపారేసింది. దీంతో ప్రతిఒక్కరు నిరుత్సాహం వ్యక్తం చేశారు.

సందీప్ కిషన్, రెజీనా జంటగా నటించిన ‘‘రారా కృష్ణయ్య’’ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలమీద రిలీజయినా ఈ చిత్రం అందరినీ నిరుత్సాహపర్చడమే కాకుండా... హీరో సందీప్ కిషన్ తన ఇమేజ్ ని డ్యామేజ్ చేసుకున్నాడని ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేశారు. కథలో కొత్తదనమేమీ లేదని, తెరకెక్కించిన విధానం కూడా అంతగా ఆకర్షణీయంగా లేదని అందరూ ఆ సినిమాను చూడటానికి ముఖం చాటేశారు. దీంతో అది ఫ్లాస్ కృష్ణయ్యగా పేరు తెచ్చుకుంది.

సినిమాకు ఫ్లాప్ టాక్ రావడంతో హీరో సందీప్ కూడా ఆందోళనల్లో మునిగిపోయాడు. ఎక్కడ తనకు ఫ్లాప్ హీరోగా ముద్ర పడుతుందేమోనన్న భయంతో... సినిమా కలెక్షన్లు ఎక్కువగా వచ్చాయని ఆశ చూపించి, సినిమా సూపర్ హిట్ అంటూ ప్రచారాలు చేసుకోవడం మొదలుపెట్టాడు. పబ్లిసిటీతో మొత్తం కలిపి ఈ చిత్రానికి కేవలం రూ.5.50 కోట్లు మాత్రమే ఖర్చయిందని... అయితే కలెక్షన్లు మాత్రం తొలి ఆరు రోజుల్లోనే సుమారు రూ.10.50 కోట్లు వసూలు చేసిందని డప్పు వాయించుకుంటున్నాడు. సినిమా కథ కొత్తది కాకపోయినా... కథ సాగే విధానంలో కొత్తదనం కనిపిస్తుందని చెబుతూ.. తనకు తాను పబ్లిసిటీ చేసుకోవడం మొదలుపెట్టేశాడట!

సందీప్ కిషన్ ఇప్పుడెన్నీ ప్రచారాలు చేసుకున్న, ఎన్ని లెక్కలు చూపించినా... ఎటువంటి ఫలితం దక్కదని, సినిమా రిలీజయినరోజే ‘‘పోరా కృష్ణయ్య’’గా పేరు తెచ్చుకుందని సినీ విశ్లేషకులు కామెంట్లు చేస్తున్నారు. ఇకనుంచయినా బుద్ధిగా మంచి కథనం వున్న సినిమాలు చేసుకుంటూ... కెరీర్ మీద దృష్టి పెట్టుకుంటే బాగుంటుందని సలహాలు ఇస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా దెబ్బతో ఫ్లాప్ హీరోగా పేరు తెచ్చుకున్న సందీప్... తన తదుపరి సినిమాలతోనైనా మంచి పేరు సంపాదించుకుంటాడని ఆశిద్దాం!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles