Siddharth jigarthanda movie dubbed in telugu as chikkadu dorakadu

siddharth jigarthanda movie dubbed in telugu, Siddarth Movie Chikkadu Dorakadu, Siddarth Chikkadu Dorakadu Audio, Samanta lover siddharth new movie Posters

siddharth jigarthanda movie dubbed in telugu

సమంతా లవర్ చిక్కడు..దోరకడు !

Posted: 07/11/2014 11:50 AM IST
Siddharth jigarthanda movie dubbed in telugu as chikkadu dorakadu

గత కొంత కాలంగా సమంతా గురించి, కానీ, ఆయన లవర్ సిద్దార్థ్ గురించి కానీ మీడియాలో వార్తలు రావట్లేదు. ఆయన సమంతాకే చిక్కకుండా, దొరకకుండా తిరుగుతున్నాడట. కారణం ప్రస్తుతం తమిళంలో ‘జిగర్తాండ ’ అనే చిత్రంలో నటిస్తున్నాడు.

ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో ‘చిక్కడు-దొరకడు ’ పేరుతో విడుదల చేస్తున్నారు. అప్పుడెప్పుడో వచ్చిన ‘సమ్ థింగ్ సమ్ థింగ్ ’ సినిమా తరువాత తెలుగులో ఇప్పటి వరకు కనిపించని సిద్దూ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘పిజ్జా ’ ఫేం కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో లక్ష్మీ మీనన్ కథానాయిక.

త్వరలోనే దీని ఆడియో వేడుకను హైదరాబాదులో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా హిట్టయితే సిద్దూ కెరీర్ మళ్లీ తెలుగులో పుంజుకుంటుదనే ధీమాతో ఉన్నాడు. మరో వైపు సమంతా వరుస ఆఫర్లతో బిజీగా ఉండటంతో సిద్దూ చిక్కకుండా పోతున్నాడని తెగ ఫీలయ్యి పోతుందట. గదీ మేటర్.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles