Baahubali one year journey making video

baahubali one year journey making video, prabhas baahubali, bahubali, prabhas, baahubali funny video, baahubali new year video, baahubali first look, bahubali first look, baahubali making,

baahubali one year journey making video

‘బాహుబలి ’ ఏడాది వీడియో వచ్చింది

Posted: 07/07/2014 03:08 PM IST
Baahubali one year journey making video

దర్శకధీరుడు రాజమౌళి టాలీవుడ్  లో అంత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న చిత్రం ‘బాహుబలి ’ తో కొత్త ట్రెండ్ కు తెర తీశాడు. తాను రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ సన్నివేశాలను వీడియో రూపంలో తన చిత్ర బృందంలోని వారి బర్త్ డేలకు విడుదల చేస్తూ వారికి గిఫ్ట్ గా ఇప్పటికే ప్రభాస్, అనుష్క, తమన్నాల బర్త్ లకే ఫస్ట్ లుక్ పాటు ఓ మీడియోను కూడా విడుదల చేసిన ఈయన ఇప్పుడు తన వదిన, కీరవాణి భార్య, బాహుబలి లైన్ ప్రొడ్యూసర్ అయిన శ్రీవల్లి జన్మదినం సందర్భంగా, బాహుబలి షూటింగ్ మొదలు పెట్టి ఈనెలతో ఏడాది పూర్తి కావడంతో ఇటీవల చిత్రీకరించిన సన్నివేశాలను జోడిస్తూ మరో వీడియోను విడుదల చేశాడు.

ఇందులో ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఫైట్స్ సీన్ కి సంబంధించిన సీన్స్ కూడా ఉన్నాయి. కొన్ని సెకండ్ల పాటు కనిపించే ఈ సీన్స్ హాలీవుడ్ తరహాలో ఉన్నాయి. ఇవే సీన్స్ వెండితెర పై చూస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. ఇక ఈ సినిమా కోసం ఆ చిత్ర నటీనటులు, బృందం కష్టపడుతున్న తీరు చూస్తుంటే జక్కన్న ఎంత ఎఫర్ట్ పెట్టి తీస్తున్నాడో అర్థం అవుతుంది. రామోజీ ఫిలిం సిటీలో తెరకెక్కించిన ఫైట్ సీన్ ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తుందేమో అనిపిస్తుంది.

కర్నూలులో, రామోజీ ఫిలిం సిటీలో వాటర్ ఫాల్స్ దగ్గర తెరకెక్కించిన సీన్లు అందరిని ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి భాగం 2015 లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles