Dil raju bought baahubali nizam rights

Dil Raju Bahubali Copyrights, Dil Raju Buys Bahubali, Bahubali Nizam Area, Latest Telugu News, Tollywood Movies News, Telugu Gossips, Tollywood Latest News

Finally Dil Raju Brought Bahubali Part 1 copyrights in Nizam Area. Dil Raju Brought Bahubali Movie Rights at 25 cores for Nizam area. For more Latest Telugu Film News and Gossips click on www.teluguwishesh.com

‘బాహుబలి’ బడ్జెట్ డబ్బులు తిరిగొచ్చాయి

Posted: 07/05/2014 11:08 AM IST
Dil raju bought baahubali nizam rights

కొంత మంది దర్శకులు, స్టార్ హీరోలు నటించే సినిమాలను వెనకా ముందు ఆలోచించకుండా ఎంత రేటైనా పెట్టి కొనేస్తారు. కారణం వారి గత సినిమాల ట్రాక్ రికార్డే. టాలీవుడ్ లో రాజమౌళి దర్శకత్వం వహించే సినిమాల క్రేజే వేరు. ఆయన సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండే ఎప్పుడెప్పుడు రైట్స్ కొనేద్దామా అని ఆత్రంగా ఎదురు చూస్తారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వం వహిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘బాహుబలి ’ విషయంలో కూడా అదే జరుగుతుంది.

సినిమా నిర్మాణంలో ఉండగానే ఆ సినిమాకు అయ్యే బడ్జెట్ లో సగానికి పైగా ఇప్పుడే డబ్బులు వచ్చాయంటేనే అర్థం చేసుకోవచ్చు. నిన్నటి వరకు ఈ సినిమా బెంగళూర్ (9 కోట్లు), సీడెడ్ (13 కోట్లు) ఏరియాలు ఫ్యాన్సీ రేట్లకు అమ్ముడు పోగా, తాజాగా నైజాం ఏరియాకు కూడా రికార్డు స్థాయిలో రేటు పలికిందంటూ టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ లో ప్రముఖ డిస్టిబ్యూటర్ అయిన దిల్ రాజు నైజాం రైట్స్ ను 25 కోట్లు పెట్టి తీసుకోవడానికి కమీట్ అయ్యాడని అంటున్నారు. రెండు పార్టులుగా వస్తున్న ఈ సినిమా పార్టు - 1కి ఇప్పటికే దాదాపు 45 కోట్ల వరకు  వచ్చాయి.

ఆంధ్రా హక్కులు ఇంకా అమ్ముడు పోలేదు. ఇవి ఇరవై కోట్లకు అమ్ముడు పోతే మొత్తం బడ్జెట్ లో 65 కోట్ల వరకు వచ్చినట్లే. ఒక్క పార్టు - 1 కే ఇంత వస్తే పార్టు - 2 ఉంది, శాటిలైట్స్ రైట్స్, ఓవర్ సీన్ హక్కులు ఇంకా మిగిలే ఉన్నాయి. ఈ లెక్కన చూసుకుంటే ‘బాహుబలి ’ నిర్మాతలకు సినిమా షూటింగు దశలోనే లాభాల బాట కనిపిస్తుండటంతో ఎంత బడ్జెట్ అయినా పెట్టడానికి సిద్దంగా ఉన్నారని అంటున్నారు. అన్నట్లు ఈ సినిమా దాదాపు 175 కోట్లతో రూపొందుతుంది. ప్రభాస్, రాణా, అనుష్క, తమన్నాలు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles