Rajinikanth plays dual role in lingaa movie

rajinikanth plays dual role in lingaa movie, rajinikanth plays dual avatar in lingaa, rajini's next with ks ravikumar titled lingaa, superstar rajinikanth, rajinikanth movies.

rajinikanth plays dual role in lingaa movie

కలెక్టర్ అవతారం ఎత్తబోతున్న రజినీ

Posted: 07/02/2014 06:51 PM IST
Rajinikanth plays dual role in lingaa movie

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవలి కాలంలో నటిస్తున్న సినిమాల్లో డ్యూయల్ రోల్స్ పోషిస్తున్నాడు. ఇటీవల వచ్చిన ‘కొచ్చాడయాన్ ’ సినిమా లో రాణా, విక్రమసింహా పాత్రల్ని పోషించి మెప్పించాడు. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద అనుకున్న విజయాన్ని సాధించకపోయినా, రజినీ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ చిత్రం తరువాత కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ‘లింగా ’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకు వచ్చింది.

ఈ చిత్రంలో  రజినీ పోషిస్తున్న ఈ రెండు పాత్రల్లో ఒకటి జిల్లా కలెక్టర్ పాత్ర కాగా, మరొకటి ఫ్లాష్బ్యాక్లో వచ్చే పాత్ర అని, అయితే ఆ రెండో పాత్ర ఏంటన్న విషయాన్ని మాత్రం రహస్యంగానే ఉంచారని ఆ సినిమా వర్గాలు తెలిపాయి. రజినీకాంత్ సరసన ప్రముఖ నటుడు శత్రుఘ్న సిన్హా కూతురు సోనాక్షి నటిస్తుంది. ఈ చిత్రంలో జగపతిబాబు కూడా ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ స్వరాలు అందిస్తున్నారు . ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాల్ని మరిన్ని అందిస్తూనే ఉంటాం కాబట్టి చదువుతూనే ఉండండి తెలుగు విశేష్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles