Salman khan open a job portal for unemployed fans

salman khan open a job portal for unemployed fans,

salman khan open a job portal for unemployed fans

ఫ్యాన్స్ కు లైఫ్ ఇచ్చిన సల్లూ భాయ్

Posted: 06/26/2014 05:05 PM IST
Salman khan open a job portal for unemployed fans

(Image source from: salman khan open a job portal for unemployed fans )

పేదవారికి ఎంతోకొంత సహాయం చేయాలనే తపన కలిగిన సూపర్ స్టార్స్ లలో బాలీవుడ్ కండలవీరుడు ఎప్పుడూ ముందుంటాడు. తమకు కష్టాలు వున్నాయంటూ ఎవరైనా తనముందు ప్రస్తావన తీసుకొస్తే... ఇట్టే కరిగిపోయి వారికి తోచిన సహాయం చేసి పంపిస్తాడట! గతంలో కూడా ఇతను హార్ట్ పేషెంట్లకు, కిడ్నీలతో బాధపడుతున్న రోగస్తులకు కొన్ని ప్రత్యేక పథకాల ద్వారా చేయూతనందించాడు. అందువల్లేనేమో... ఇతని అభిమానులు అందరూ ప్రేమగా ‘‘సల్లూభాయ్’’ అని పిలుస్తుంటారు.

ఇప్పుడు తాజాగా ఈ బాలీవుడ్ సల్లూ భాయ్ తన ప్రియతమ అభిమానుల కోసం ఒక జాబ్ పోర్టల్ ను ప్రారంభించాడు. ఇతనిని ఎంతగానో ఆదరించే అభిమానులు చాలావరకు ఉద్యోగాలు లేకుండా ఖాళీగా తిరుగుతున్నారని తెలుసుకున్న ఈ బ్యాచిలర్ బాయ్... వారికి ఉద్యోగాలు ఇప్పించే పనిలో పడ్డాడు. ఈ అభిప్రాయం చేసుకున్న వెంటనే నిరుద్యోగుల కోసం ఒక వేదికను ఏర్పాటు చేశాడు. అందులో భాగంగానే తన అభిమానుల్లో ఎవరైతే నిరుద్యోగులుగా వున్నారో వారంత తమ పేరును రిజిష్టర్ చేసుకోవాలని పేర్కొన్నాడు. జాబ్ పోర్టల్ లింక్ : http://www.beinghumanworkshop.com

తన అభిమానుల్లో నిరుద్యోగులుగా వున్నవారందరికీ ఉద్యోగాలు ఇప్పించాల్సిందిగా తన మిత్రులతోపాటు తనను అభిమానించే కంపెనీలు, ఫ్యాక్టరీలు, బిజినెస్ మెన్లకు ‘‘తమతమ కార్యాలయాల్లో వున్న ఖాళీ ఉద్యోగాలను నా ఫ్యాన్స్ తో భర్తీ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను’’ అని తన ట్వీట్టర్ లో పేర్కొన్నాడు. సల్లూ భాయ్ తన హ్యూమన్ బీయింగ్ ఫౌండేషన్ ద్వారా ఈ పనిని చేపట్టినట్టు తెలిపాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న అభిమానులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles