The first look photos of allu arjun in rudrama devi movie

the first look photos of allu arjun in rudrama devi movie, rudrama devi movie, rudrama devi movie latest news, allu arjun in rudrama devi movie, allu arjun first look in rudrama devi movie, allu arjun latest photos in rudrama devi movie, anushka in rudrama devi movie

the first look photos of allu arjun in rudrama devi movie

కొత్త అవతారంలో బన్నీ!

Posted: 06/26/2014 03:37 PM IST
The first look photos of allu arjun in rudrama devi movie

(Image source from: the first look photos of allu arjun in rudrama devi movie)

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ స్టైలే వేరు..! తాను నటించే ప్రతి ఒక్క చిత్రంలో డిఫరెంట్ గా కనిపిస్తూ ప్రేక్షక జనాలను అలరిస్తూ వుంటాడు. ‘‘రేసుగుర్రం’’ సినిమాలో పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా కనిపించిన ఈ స్టైలిష్ స్టార్... ‘‘రుద్రమదేవి’’ సినిమాలో గోన గన్నారెడ్డిగా ఒక చిన్న పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే! తన తరువాతి సినిమాకు కాస్త గ్యాప్ ఎక్కువగా వుండటంతో... ఈ క్యారెక్టర్ లో నటించడానికి సై అన్నాడు.

రుద్రమదేవి సినిమాలో స్పెషల్ పాత్రను పోషించనున్న అల్లు అర్జున్... తన స్టైలిష్ గెటప్ ను మార్చి, ఒక కొత్త లుక్ లో కనిపించబోతున్నాడు. గతంలో వున్న పాత్రలకు భిన్నంగా ఇందులో గడ్డం, మీసాలు పెంచడంతోపాటు బాడీ బిల్డింగ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కొత్త గెటప్ కు సంబంధించి రెండు తాజా ఫోటోలు కూడా రిలీజ్ అయ్యాయి. అయితే ఈ ఫోటోలు సినిమాకు సంబంధించిన స్కెచ్చులు కాకపోయినా... అందులో ఆయన కనిపించబోతున్న రీసెంట్ లుక్స్ అని యూనిట్ సభ్యులు పేర్కొంటున్నారు. అలాగే ఈ గెటప్ లోనే ఆయన ప్రెస్కి ఫోటోలన త్వరలో రిలీజ్ చేయబోతున్నట్టు వారు తెలిపారు.

అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీలో అల్లు అర్జున్ పాత్ర చాలా కీలకమైనదని యూనిగ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ సినిమాలో కత్తిసాము ఫైట్ చేయనున్న బన్నీ.. అందుకోసం ప్రత్యేక శిక్షణలు కూడా తీసుకుంటున్నాడు. అయితే ఈ ఫోటోలను తిలకించిన నెటిజన్లందరూ... సినిమా ప్రమోషన్ కోసమే ఇలా అల్లు అర్జున్ క్యారెక్టర్ కి సంబంధించి ఫోటోలు రిలీజ్ చేశారని అనుకుంటున్నారు. ఏదేమైనా... అల్లు అర్జున్ కొత్త లుక్ మాత్రం అదుర్స్ అని ప్రతిఒక్కరు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles