Rani mukherjee bold comments on all actress in her movie trailer launch function

Rani Mukherjee bold comments on all actress in her movie trailer launch function, rani mukherjee, rani mukherjee latest news, rani mukherjee mardani movie, mardani movie trailer, mardani movie latest news, mardani movie trailer launch, mardani movie trailer news, rani mukherjee bold comments on directors and producers

Rani Mukherjee bold comments on all actress in her movie trailer launch function

రాణిని వాడుకున్న సినిమారాజులు!

Posted: 06/25/2014 07:01 PM IST
Rani mukherjee bold comments on all actress in her movie trailer launch function

(Image source from: Rani Mukherjee bold comments on all actress in her movie trailer launch function )

గత కొద్దికాలంగా సినిమా అవకాశాలు సరిగ్గా రాకపోవడంతో దర్శక నిర్మాతల మీద విరుచుకుపడుతోంది రాణిముఖర్జీ! గతంలో నటించిన సినిమాలన్నీ వరుస పరాజయాలు కావడంతో తన మనులో వున్న వేదనను నలుగరితో పంచుకుంది. తాను సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చుకున్నప్పటి నుంచి ఇంతవరకు అందరూ ఆమెను రకరకాలుగా వాడుకున్నారని ఆరోపణలు చేస్తోంది. తాను ఎంత పెద్ద నటి అయినా... క్రియేటివ్ వ్యక్తుల చేతుల్లో కీలుబొమ్మలాగే వుండేదానినని... వారు చెప్పిన విధంగా సర్దుకునేదానని... తన జీవిత రహస్యాల గురించి బయటపెట్టేసింది.

బాలీవుడ్ ముదురు తార అయిన ఈ రాణిముఖర్జీ... తాను తాజాగా నటించిన ‘‘మర్దానీ’’ మూవీ ట్రైలర్ లాంచ్ సందర్భంగా పై విధంగా సంచలనాత్మకంగా వ్యాఖ్యలు చేసింది. సినిమాలో ప్రవేశించిన ప్రతిఒక్కరిని క్రియేటివ్ వ్యక్తులు తమకు ఇష్టమొచ్చినట్టుగా వాడుకుంటారని ఆరోపణలు చేసింది. తనతోపాటు యావత్తు ప్రపంచంలో వున్న నటీనటులందరినీ కలిపి భిక్షగాళ్లమని చెప్పుకుంది. ఎంతటి పెద్ద నటినటులైనా... ఒకరి కాలికింద నలిగిపోవాల్సిందేనని... జీవితం కొనసాగించడం కోసం భిక్షవాడిలాగా అడుక్కుతింటూ వుండాలని నిక్కర్చిగా నిజాలను బయటపెట్టేసింది.

ఈ మాటలు విన్న సదరు దర్శకనిర్మాతలతోపాటు అక్కడున్న మీడియా మెంబర్లంతా ఒక్కసారిగా ఖంగుతిన్నారు. రాణి ముఖర్జీ ఇటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తోందని అందరూ ఆలోచనలో పడిపోయారు. చివరికి అర్థం కాక... ఇటువంటి వ్యాఖ్యలు మీరెందుకు చేస్తున్నారని మీడియా సభ్యులు ఒకరు ఆమెను ప్రశ్నించిన తరువాత క్లారిఫికేషన్ ఇచ్చుకుంది.

‘‘సినీ పరిశ్రమలో ఎంత పెద్ద హీరో, హీరోయిన్లు అయినా... తమకు నచ్చిన పాత్రను దర్శకనిర్మాతలను అడిగి తీసుకోలేరని... ఎవరు ఏ విధమైన పాత్ర ఇస్తారో ఆ పాత్రలను ఎటువంటి పరిస్థితిలోనైనా అంగీకరించాల్సిందేనని’’ అంటూ క్లుప్తంగా వివరించింది. ‘‘మేము మా పాత్రలను ఎప్పటికీ ఎంచుకోలేము. క్రియేటివ్ వ్యక్తులే మాకు ఫలానా పాత్రలను నటించాలని ప్రదానం చేస్తారు’’ అని వివరణ ఇచ్చుకుంది.

అలాగే తన తాజా సినిమా విశేషాల గురించి వివరిస్తూ... ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఈ సినిమాలో నటిస్తున్నట్టు పేర్కొంది. ‘‘ఢిల్లీ వంటి మహానగరాల్లో అమ్మాయిల మీద జరుగుతున్న అత్యాచారలను ఉద్దేశించి ఈ సినిమాను చిత్రీకరించాం. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను అరికట్టడం కోసం ఈ సినిమాను తెరకెక్కించాం’’ అని పేర్కొంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles