Rajamouli facebook likes crosses 20 millions

rajamouli facebook likes crosses 20 millions, rajamouli latest news, director rajamouli latest news, rajamouli facebook, rajamouli twitter, rajamouli facebook likes 20 millions, rajamouli twiiter followes, rajamouli facebook followers, rajamouli creates history, rajamouli creates another record

rajamouli facebook likes crosses 20 millions

రికార్డులకు మారుపేరు రాజమౌళి

Posted: 06/24/2014 06:14 PM IST
Rajamouli facebook likes crosses 20 millions

(Image source from: rajamouli creates another record)

ఎస్ఎస్ రాజమౌళి... ది మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఇన్ టాలీవుడ్! ఈ మాట కేవలం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు... యావత్తు భారతదేశం మొత్తం మీదున్న డైరెక్టర్లు, యాక్టర్లందరూ ఒప్పుకుంటారు. ప్రతి సినిమాలో తనదైన స్టయిల్ లో వ్యూహాత్మకంగా మలిచి, తెలుగు సినీపరిశ్రమ స్టాండర్డ్స్ ని పెంచిన ఏకైక డైరెక్టర్! సాధారణంగా ప్రతిఒక్కరు రికార్డులు సాధించడానికి అవకాశాలకోసం ఎదరుచూస్తుంటే... అవే రికార్డులు ఈయన రాకకోసం ఎదురుచూస్తుంటాయి. దటీజ్ ద పవర్ ఆఫ్ రాజమౌళి.

రాజమౌళికి రికార్డులు సృష్టించడం కొత్తేమీ కాదు. ఈయన తీసిన ప్రతిఒక్క సినిమాలో తనదైన ప్రత్యేకతను కనబరిచి, ప్రేక్షకుల మదిలో నిలిచిపోతాడు. ఏ దర్శకుడు చేయని సాహసోపేతమైన పనులు చేయడంలో ఈయనకు ఈయనే సాటి! టాలీవుడ్ లో వున్న ఎందరో దర్శకులు ఈయన అడుగుజాడల్లోనే నడుస్తారు. షూటింగ్ సమయాల్లో ఈయనకున్న ఆసక్తి, నిబద్దత ఏ ఒక్క దర్శకుడికి అంతగా వుండవని సినీజనాలు విశ్లేషించుకుంటుంటారు. ఆస్కార్ అవార్డు గ్రహీత అయిన క్లాడే లీలౌచ్ అనే హాలీవుడ్ డైరెక్టర్ కూడా ఈయన గురించి ప్రశంసల జల్లులు కురిపించారు. అంతటి అరుదైన రికార్డులను సాధించిన ఈ జక్కన్న.. తాజాగా మరో రికార్డును సొంతం చేసుకున్నారు.

సినిమా షూటింగుల్లో రాజమౌళి ఎంత బిజీగా వున్నా... ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ నెట్ వర్కింగ్స్ ద్వారా తన సినిమా విశేషాల గురించి అభిమానులతో పంచుకుంటూనే వుంటారు. దాంతో ఈయన ఫేస్ బుక్ లైక్స్ 20 లక్షలకు పైగా దాటిపోయింది. మొత్తం భారతదేశంలో ఇంతవరకు ఏ ఒక్క దర్శకుడికి లభించని ఈ అరుదైన గౌరవం కేవలం రాజమౌళికి మాత్రమే దక్కింది. దీంతో జక్కన్న ఇండియాలోనే టాప్ డైరెక్టర్ గా కితాబును దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా తన ఫేస్ బుక్ ఫాలోవర్స్ అందిరికీ థ్యాంక్స్ చెబుతూ.. ఆయన ట్వీట్ చేవాడు.

‘‘నా సినిమాలను ఆదరించి, నన్ను గౌరవించినందుకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ ఆశీస్సులతోనే నేను ఈ స్థితిలో వున్నాను. మీరు ఎప్పటికీ నన్ను ఇలాగే ఆదరిస్తారని నేను కోరుకుంటున్నానని’’ అంటూ అభిమానులతో తన సంతోషాన్ని పంచుకున్నాడు. ప్రస్తుతం రాజమౌళి టాలీవుడ్ లోనే అత్యంత భారీ బడ్జెట్ అయిన ‘‘బాహుబలి’’ షూటింగ్ లో చాలా బిజీగా వున్నాడు. ఈ సినిమా తాజా షెడ్యూల్ కూడా మంగళవారం ఉదయం నుంచి అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక సెట్లో ప్రారంభమైంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles