(Image source from: Tamil producers association warns actress anjali)
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో ‘సీత’ పాత్రలో మంచి నటనను ప్రదర్శించిన అంజలి... తెలుగు ప్రజలకే కాదు... తమిళ తంబీలకు కూడా సుపరిచితమే! డైరెక్టర్ కళంజియం, అత్తతో జరిగిన గొడవ వివాదాల కారణంగా చాలారోజుల వరకు సినిమాతెరకు దూరమై, కనుమరుగైపోయింది. మధ్యలో ఈ వివాదాల సమస్య కొద్దివరకు తగ్గిపోయినప్పటికీ.. ఈమెకు ఎటువంటి అవకశాలు వరించలేదు.
అయితే తాజాగా ఈమెకు తమిళ తంబీల నుంచి ఒక పిలుపు వచ్చింది. దాంతో వచ్చిన అవకాశాన్ని సద్వినయోగ పరుచుకోవాలని అంజలి సదరు సినిమా చేయడానికి ఒప్పుకుంది. అయితే ఇక్కడే ఈమెకు మరో చిక్కు వచ్చి పడింది. తమిళ దర్శకుడు కళంజియమ్ ఈమె కొత్త సినిమాకు అడ్డు పడుతున్నాడు.
గతంలో కళంజియమ్ దర్శకత్వం వహించిన ‘‘ఊరు సుట్రి పురాణం’’ అనే సినిమా నుంచి అంజలి తప్పుకున్న విషయం అందరికీ తెలిసిందే! ఈ విషయంపై డైరెక్టర్ తమిళ నిర్మాతల గిల్డ్ కు ఫిర్యాదు కూడా చేశాడు. తన చిత్రం పూర్తి కాకుండానే మధ్యలో వదిలి వెళ్లిపోయి, మరో తమిళ సినిమా చేయడానికి సిద్ధమవుతోందంటూ కంప్లైంట్ చేశాడు.
దీనిపై పరిశీలించిన నిర్మాతల గిల్డ్... సదరు వార్త నిజమేనని తెలుసుకుని, అంజలికి గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం! ‘‘కళంజియమ్ సినిమా ఎలాగైనా పూర్తి చేయాలని... అలాకాకుండా సినిమా పూర్తి చేయకపోతే అందుకు నష్టపరిహారం చెల్లించాలని’’ ఆమెకు లేఖ పంపినట్టు తెలుస్తోంది. అవసరమైతే.. ఆమెను తమిళంలో సినిమాలు చేయనీకుండా నిషేధం విధిస్తామని కూడా ఘాటు విమర్శలు చేసినట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు తెలుపుతున్నాయి.
అలాగే వీళ్లిద్దరి వ్యవహారం పూర్తిగా తేలేవరకు అంజలి ఎటువంటి సినిమాలు ఒప్పుకోకూడదని... తమకి చెప్పాపెట్టకుండా ఎక్కడికి వెళ్లకూడదని నిర్మాతల గిల్డ్ ఆమెకు వార్నింగ్ ఇచ్చినట్టు తాజా వార్తలు తెలుపుతున్నాయి.
AS
(And get your daily news straight to your inbox)
Aug 08 | టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్మార్ ఖాన్’. కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటించింది. ఇవాళ మేకర్స్ తీస్మార్... Read more
Aug 04 | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘సీతారామం’ ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు ఏర్పడిన బజ్ మరేసినిమాకు ఏర్పడలేదు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన... Read more
Aug 04 | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ చిత్రం ‘బింబిసార’. గత కొన్నాళ్లుగా చక్కని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు లభించిన చక్కని టైమ్ ట్రావెల్ చిత్రం కలసిరానుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.... Read more
Aug 04 | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి.... Read more
Aug 04 | దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్‌కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్‌లో ఇటు ఫ్యామిలీ... Read more