కెరియర్ పరంగా మంచి జోష్ లో ఉన్న చెన్నయ్ బ్యూటీ సమంతా పేరు ఈ మధ్యన తరుచూ వినిపిస్తుంది. మొన్నటి కి మొన్న సూర్య సరసన నటించిన ‘ఆంజాన్ ’ పోస్టర్లతో వార్తల్లో నిలిచిన ఈ అమ్మడు, నిన్న ‘అల్లుడు శీను ’ చిత్రంలో హాట్ హాట్ గా కనిపించి హైలెట్ అయ్యింది. ఇప్పుడు ఆమె ఏకంగా ఓ విషయాన్ని లీక్ చేసి అందర్ని టెన్షన్ పెడుతోంది.
ఇటీవలి కాలంలో వచ్చిన మల్టీస్టారర్ చిత్రాల్లో ఎక్కువగా కనిపించిన ఈ అమ్మడు ఇప్పుడు మరో మల్టీస్టారర్ చిత్రంలో నటించబోతున్నానని చిన్న హింట్ ఇస్తూ ట్వీట్ చేసింది. ఇప్పటికే వెంకీ-మహేష్ ల ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ’, అక్కినేని ఫ్యామిలీ ‘మనం ’ చిత్రాల్లో నటించి అభిమానులను అలరించిన ఈ అమ్మడు తాజాగా మరో మల్టీస్టారర్ కి కమీట్ అయ్యిందట. మరో మల్టీ స్టారర్ సినిమాలో చేసే అవకాశం వస్తున్నందుకు చాలా ఎగ్జయిట్ మెంట్ గా వుంది.
ఈ ప్రాజెక్టు వివరాలు త్వరలో చెబుతా ’ అంటూ సస్పెన్సులో పెట్టింది సమంతా. ఇంతకీ, నాగార్జున-ఎన్టీఆర్ నటించనున్న మల్టీ స్టారర్లోనా? లేక మరేదైనా ప్రాజక్టా ? అనే దానిలో క్లారిటీ రావాల్సి ఉంది. ఎలాగు హింట్ ఇచ్చింది కదా ? ఉన్న నిజం చెప్పేస్తే అయిపోతుంది కదా ? సగం చెప్పి టెన్షన్ పెట్టడం ఎందుకు అంటున్నారు ఆమె అభిమానులు. ఏమైనా మల్టీస్టారర్ సినిమాల బ్రాండ్ గా సమంతా ముద్ర వేసుకుందని చెప్పవచ్చు.
Knr
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more