Vashu bhagnani ban on bipasha basu

Vashu Bhagnani ban on Bipasha Basu, vashu bhagnani, bipasha basu, humshakals, sajid khan

An upset Vashu Bhagnani has decided not to work with actress Bipasha Basu again.

డస్కీ బ్యూటీకి పంచ్ బాగా పడింది..

Posted: 06/21/2014 01:25 PM IST
Vashu bhagnani ban on bipasha basu

బాలీవుడ్ డస్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న బిపాసా బసు పై దర్శక, నిర్మాతలు బసలు కొడుతున్నారట. ఈ అమ్మడు చేసిన పనికి ఆవేశంతో ఊగిపోతున్నారట. మరి వారు ఆవేశంతో ఊగిపోయే పని ఈ అమ్మడు ఏం చేసి ఉంటుంది. ఇటీవలే ఈ అమ్మడు సాజిద్ ఖాన్ దర్శకత్వంలో ‘హమ్‌ షకల్స్‌ ’ సినిమాలో నటించింది. ఈ సినిమాలో అమ్మడు దర్శకుడికి కావాల్సింత అందాలు ఆరబోయడమే కాకుండా, బికినీ కూడా వేసింది. మరి ఇంకేం చేయాలి అంటారా ? దీనికి సంబంధించిన ప్రమెషన్ పై బిపాసా ఆసక్తి చూపకపోవడం ఆ చిత్ర దర్శ నిర్మాతలకు కోపం తెప్పించింది.

ఇంత నిర్లక్ష్యమా.. మాతో ఏదన్నా సమస్య వుంటే మాట్లాడి పరిష్కరించుకోవాలి. ప్రమోషన్‌కి రాకపోతే ప్రొఫెషన్‌ని అవమానించినట్లే, ఈమెను నమ్ముకొని మోస పోయామని, ఆమెతో ఇంకెప్పుడూ సినిమాలు నిర్మించనని స్పష్టం చేశారు. బిపాసా బసు, ఇషా గుప్తా, తమన్నా, రితీష్‌ దేశ్‌ముఖ్‌, సైఫ్‌ అలీఖాన్‌ తదితరులు ఈ చిత్రంలో ప్రముఖ పాత్రలు పోషించారు.

అయితే బిపాసా సన్నిహితులు మాత్రం ఈమె ప్రమోషన్ కార్యక్రమాలకు సినిమా షూటింగ్ టైంలో మిగతా నటులకు ప్రాధాన్యత ఇచ్చి తనకు ఇవ్వకపోవడమే ఈమె అలకకు కారణం అని, అందుకే వెళ్లలేదని చెబుతున్నారు. ఏమైనా ఓ నిర్మాత బ్యాన్ విధించాడంటే మిగతా వారు ఈమెతో సినిమాలు చేయాలంటే కాస్త వెనకడగే వేస్తారు. ఇది ఈమెకు బాగా దెబ్బే అంటున్నారు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles