Venkatesh son arjun in gopala gopala

Venkatesh son Arjun, Venkatesh son Arjun entry in tollywood, Daggu Bati Arjun,Daggubati Venkatesh,Daggubati Ramanaidu,Gopala Gopala Movie,Pawan Kalyan,Oh My God,

ictory Venkatesh son, Daggubati Arjun is going to make his filmy debut with his father prestigious project Gopala Gopala.

వెంకీ తనయుడు ఎంట్రీ ఇస్తున్నాడు

Posted: 06/10/2014 05:10 PM IST
Venkatesh son arjun in gopala gopala

సినిమా ఇండస్ట్రీలోకి తన తండ్రుల వారసత్వాన్ని అందిపుచ్చుకొన్న మన టాలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పుడు వారి కొడుకుల్ని కూడా వెండితెరకు పరిచయం చేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు తాను నటించిన ‘1 నేనొక్కడినే ’ సినిమాలో ‘గౌతమ్ ’ని లాంచ్ చేశాడు. ఇప్పుడు మరో స్టార్ హీరో తన కొడుకును వెండితెరకు పరిచయం చేయబోతున్నాడు.

విక్టర్ వెంకటేష్, పవన్ కళ్యాణ్ ల మల్టీస్టారర్ మూవీ ‘గోపాల గోపాల ’ సినిమా ద్వారా వెంకటేష్ తనయుడు అర్జున్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది. తాజాగా నిన్న జరిగిన ‘గోపాల గోపాల’ పూజా కార్యక్రమంలో వెంకటేష్ కొడుకు దగ్గుపాటి అర్జున్ కనిపించి అందరి దృష్టిలో పడ్డాడు. ఈ చిత్రంలో  వెంకటేష్ పాత్రకు ఓ అబ్బాయి ఉంటాడు. ఆ పాత్రను అర్జున్ పోషిస్తాడట. వెంకటేష్ కుమారుడుగా కనిపించనున్నాడే వార్త వెంకీ అభిమానుల్ని ఆనందంలో ముంచెత్తుతుంది.

అర్జున్ ఎంట్రీ ఈ మల్టీస్టారర్ ద్వారానే అయితే బాగుందని తాత రామానాయుడు భావించి ఆయన్ను ఒప్పించారని అంటున్నారు. అయితే ఈ విషయాన్ని చివరి వరకు గోప్యంగా ఉంచాలని అనుకున్నారు. కానీ నిన్నటి పరిస్థితిని బట్టి ఇట్టే తెలిసిపోతుందని సినీ జనాలు అంటున్నారు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles