Sunil demands 3 crores remuneration

Hero Sunil demands 3 Crores, sunil remuneration, Producer DVV Danaiah, director Maruthi, sunil Bheemavaram Bullodu

Sunil for the movie demanded Rs.3 crores but the film maker was ready to shall out Rs.2 Crores.

సునీల్ కి మూడుచ్చేవారు ఎవరు ?

Posted: 06/05/2014 12:39 PM IST
Sunil demands 3 crores remuneration

తెలుగు తెర పైకి కమేడియన్ గా ఎంట్రీ ఇచ్చి హీరోగా ఎదిగిన సునీల్ చేసిన కొన్ని సినిమాలు ఫర్వాలేదనించడంతో పాటు, నిర్మాతలకు ఎలాంటి నష్టాలు మిగల్చకపోవడంతో ఆయనతో మొన్నటి వరకు సినిమాలు చేయడానికి దర్శక, నిర్మాతలు ఎగబడ్డారు. కానీ ఇటీవల ఆయన నటించిన ‘భీమవరం బుల్లోడు ’ సినిమా అనుకున్న విజయాన్ని సాధించకపోవడంతో ఈయనకు అవకాశాలు కూడా చాలా వరకు తగ్గాయి.

సునీల్ మార్కెట్ ని ద్రుష్టిలో పెట్టుకొని మిడిల్ రేంజ్ నిర్మాతలు సినిమాలు తీయడానికి వస్తే రెమ్యునరేషన్ పరంగా మనోడు కొండెక్కి కూర్చుకున్నాడట.  రూ.3 కోట్లు ఇస్తేనేగానీ... సినిమా చేసేది లేద‌ని అనేస్తున్నాడ‌ట‌. డి.వి.వి.దాన‌య్య మారుతితో ఓ సినిమా చేయ‌డానికి అడ్వాన్స్ ఇచ్చాడు.

అందులో హీరోగా సునీల్ ని తీసుకుందామని ఆయన్ను సంప్రదిస్తే... మూడు కోట్లకు పైసా తగ్గినా చేసేది లేదని చెప్పడంతో  రెండు కోట్లు ఇస్తామని నిర్మాతలు, మూడు ఇవ్వాల్సిందేనని సునీల్ బెట్టుగా కూర్చోవడంతో  దానయ్య బెంబేలెత్తి పోతున్నాడట.  చేతిలో సక్సెస్ లేకపోయినా, సునీల్ రేటు అడుతున్నాడని దానయ్య లాంటి నిర్మాతలు బెంబేలెత్తి పోతున్నారట.

అన్నట్లు సునీల్ ఇటీవల సినిమా భీమవరం బుల్లోడు ఇంతవరకు శాటిలైట్ రైట్స్ అమ్మడు కాలేదు. కొనేవాడు దిక్కులేదు. అయినా సునీల్ ఇంత డిమాండ్ చేస్తున్నాడేంటని, ఇలా బెట్టుగా కూర్చుంటే వచ్చే అవకాశాలు రాకుండా పోతాయని సినిమా ఇండస్ట్రీలో అనుభవం ఉన్న వారు సునీల్ కి సలహాలు ఇస్తున్నారు. వారి మాట వినైనా సునీల్ బెట్టు దిగేనా ?

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles