Sandeep kishan new movie title joru

Sundeep Kishan movie title, Kumar Nagendra film titled Joru, Sandeep kishan new moive Joru, Raashi Khanna, Priya Banerjee, Sushm

Sundeep Kishan is acting in the lead role in a film, which is being directed by Gundello Godari fame Kumar Nagendra.

ఎన్టీఆర్ ‘జోరు ’ టైటిల్ సందీప్ కిషన్ సినిమాకు

Posted: 05/29/2014 05:50 PM IST
Sandeep kishan new movie title joru

సినిమా ఇండస్ట్రీలోకి కొత్త హీరోయిన్లు, కొత్త హీరోలు వచ్చి తామేంటో నిరూపించుకుంటున్నారు. చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూ  పెద్ద హీరోల సినిమాలకు పోటీగా నిలుస్తున్నారు. ఒక్కోసారి పెద్ద సినిమాల కంటే ఎక్కువ వసూళ్లు కూడా సాధించిన సందర్భాలు ఉన్నాయి. తాము నటించిన సినిమాల్లో మంచి నటనను కనబర్చి వరుస అవకాశాలు కొట్టేయడంతో పాటు, పెద్ద హీరోల సినిమాల టైటిళ్లు కూడా లాగేసుకుంటున్నారు.

‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ’ సినిమాతో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న సందీప్ కిషన్ జూనియర్ ఎన్టీఆర్ చేస్తాడనుకున్న టైటిల్ని లాగేసుకున్నాడు. గతంలో ఎన్టీఆర్ ‘జోరు ’ అనే సినిమాలో నటించబోతున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ టైటిల్ ని ‘గుండెల్లో గోదారి ’ సినిమా రూపొందించిన దర్శకుడు కుమార్ నాగేంద్ర దర్శకత్వం వహిస్తున్న  సినిమాకు ఖరారు చేశారు.

ఓ ప్రక్కన రారా క్రిష్ణయ్య సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్న సందీప్ మరో ప్రక్క ఈ సినిమాలో నటిస్తూ సగం సినిమా షూటింగును కూడా పూర్తి చేశాడట. ఈ సినిమాలో సందీప్ సరసన రాశిఖన్నా, ప్రియాబెనర్జి, సుష్మలు ముగ్గురూ నటిస్తున్నారు. ప్రేమ, కుటుంబ కధా చిత్రంగా రూపొందిస్తున్నట్లు దర్శకుడు తెలిపాడు. ఈ చిత్రం కథకు అనుగుణంగా ‘జోరు ’ టైటిల్ కరెక్టుగా యాప్ట్ అవుతుందనే ఉద్దేశ్యంతో ఈ టైటిల్ ఖరారు చేసినట్లు తెలిపారు.

ఈ సినిమాను అశోక్, నాగార్జున అనే కొత్త నిర్మాతలు నిర్మిస్తున్నారు. ఈ సినిమాని జూలై నెలాఖరులో గాని, ఆగష్టు నెల ప్రధమార్ధంలో గాని విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. ఒకేసారి రెండు సినిమాలు చేస్తున్న ఈ కుర్ర హీరో ఇదే జోరును కొనసాగిస్తాడో లేదో చూడాలి.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles