Udaya bhanu acting in revolver rani remake

Udaya Bhanu in Revolver Rani Remake, Tollywood Movie news, Udaya Bhanu acting in Revolver Rani Remake, Udaya Bhanu impressed Revolver Rani

Udaya Bhanu has seen the film and was totally impressed with Kanganas performance in Revolver Rani.

బోల్డ్ సినిమాలో తెలుగు హాట్ యాంకర్

Posted: 05/15/2014 07:27 PM IST
Udaya bhanu acting in revolver rani remake

బుల్లితెర హాట్ యాంకర్ గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఉదయభాను వెండితెర పై ఐటెంసాంగులతో ఎంట్రీ ఇచ్చి, ఇటీవలే ‘మధుమతి ’ సినిమా ద్వారా హీరోయిన్ గా  మారిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో మితిమీరిన అందాలు ప్రదర్శించి, తరువాత పెద్ద రాద్దాంతం కూడా చేసింది. అయితే ఇఫ్పుడు ఈ అమ్మడు బాలీవుడ్ లో హిట్ చిత్రాలు అయిన ‘క్వీన్ ’,  ‘రివాల్వర్ రాణి ’ చిత్రాలను ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేయాలని కొంత మంది దర్శక నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.

కాగా...రివాల్వర్ రాణి చిత్రంలో నటించేందుకు టాలీవుడ్ హాట్ యాంకర్ ఉదయభాను ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ఈచిత్రాన్ని ఉదయభాను చూసిందని, సినిమాలో కంగనా రనౌత్ పోషించిన పాత్ర, ఆ సినిమా కాన్సెప్టు ఆమెకు చాలా నచ్చాయని అంటున్నారు. ఈ మేరకు ఈ చిత్రాన్ని తెలుగులో తీస్తే నటించేందుకు ఆసక్తిచూపుతున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ ఉదయభాను ఈ చిత్రం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. కంగనా రనౌత్ మాదిరిగా బోల్డ్‌గా నటించాల్సి ఉంటుంది.

బాలీవుడ్ భామ కంగానా తెగించినంతగా తెలుగు తెర పై ఉదయభాను అంత హాట్ గా నటించడానికి సాహసం చేస్తుందా ? ఒక వేళ చేస్తే గత సంఘటనలను ద్రుష్టిలో పెట్టుకొని నిర్మాతలు ఈమెతో సినిమా చేయడానికి సాహసం చేస్తారా అన్నది వేచి చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles