Chiranjeevi disappointed with krishna vamsi direction

chiranjeevi disappointed krishna vamsi direction, Charan Disappointed With Krishna Vamsi Script, ram charan teja, krishna vamsi, kajal, chiranjeevi, govindudu andarivadele movie

chiranjeevi disappointed with krishna vamsi direction. Chiru and Charan Disappointed With Krishna Vamsi Script. Chiru got to know about this and he has immediately asked Krishna Vamsi to halt the shooting and come up with the complete script.

కృష్ణ వంశీకి క్లాస్ పీకిన చిరంజీవి

Posted: 05/15/2014 10:37 AM IST
Chiranjeevi disappointed with krishna vamsi direction

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా, తన కొడుకు చరణ్ సినిమాల విషయాలు మాత్రం దగ్గరుండి చూసుకుంటాడు. తనకు ఏమైనా నచ్చక పోతే కొన్ని సూచనలు సలహాలు ఇస్తాడు. కొన్ని సినిమాల్లో సీన్లను కూడా రీషూట్ చేయమంటాడు. తాను చెప్పింది చేయకపోతే కాస్తంత చిర్రుబుర్రులాడుతాడు. తాజాగా దర్శకుడు కృష్ణ వంశీ పై చిరు ఫైర్ అయ్యినట్లు ఫిలింనగర్ వర్గాల సమాచారం.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ దర్శకత్వంలో ‘గోవిందుడు అందరి వాడేలే' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పొల్లాచ్చి, కన్యాకుమారిలో షెడ్యూల్స్ పూర్తి చేసుకొని ఇటీవలే హైదరాబాద్ కి వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. జ్వరం కారణంగా రామ్ చరణ్ ఇటీవల తన సోషల్ నెట్వర్కింగ్ ద్వారా వెల్లడించారు.

కానీ సినీ జనాలు మాత్రం కృష్ణవంశీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్న విధానం చిరంజీవికి నచ్చకపోవడం వల్లే విరామం ఇచ్చారని ఫిల్మ్ నగర్లో ప్రచారం జరుగుతోంది. చరణ్ ఇమేజ్‌కు తగిన విధంగా సినిమాను తెరకెక్కించలేని, కొన్ని సీన్లు మార్చమంటూ సూచనలు ఇచ్చి రీషూట్ చేయమని చెప్పినట్లు అనుకుంటున్నారు. తనకు నచ్చిన విధంగా సినిమాలు తీసే క్రిష్ణవంశీ చిరు సలహాలు స్వీకరించి రీషూట్ చేస్తాడో లేదో చూడాలి.

పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మాణంలో  రామ్ చరణ్, శ్రీకాంత్, కాజల్ అగర్వాల్, కమలినీ ముఖర్జీ, రాజ్ కిరణ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles