Tamil comedy actor santhanam life change

tamil comedy actor santhanam, comedy actor santhanam life change, telugu comedy actor sunil, Tamil comedian Santhanam, Santhanam to play hero.

tamil comedy actor santhanam life change

‘సునీల్ లా’ సంతానం మారతాడా..?!

Posted: 05/14/2014 05:43 PM IST
Tamil comedy actor santhanam life change

ఈరోజుల్లో ప్రతి సినిమాకు ప్రస్తుతం కామెడీనే ప్రధానంగా మారిపోయింది. కామెడీ లేకుండా ఒక మూవీ హిట్ అయ్యే పరిస్థితులు లేవు. దీంతో కమెడియన్లకు ఇండస్ట్రీలో డిమాండ్ బాగా పెరిగిపోయింది. సినిమాకు వినోదం ఆక్సిజన్ గా మారిన తర్వాత కమెడియన్స్ కి స్టార్ వాల్యూ వచ్చింది.

తమిళంలో అలాంటి స్టేటస్ తెచ్చుకున్న కమెడియన్ 'సంతానం'. భారీ డిమాండ్ ఉన్న సంతానం ఉంటే సినిమా హిట్ కి సగం గ్యారెంటీ అనే ట్యాగ్ లైన్ ఉంది. ఆ ఇమేజ్ ని చాలాసార్లు నిలబెట్టుకున్నాడు కూడా. సంతానం సపోర్ట్ తో గట్టెక్కిన సినిమాలు చాలా ఉంటాయి. హీరోకి ఫ్రెండ్ గా ప్రతీ హీరోకు ఫస్ట్ ఛాయిస్ అయ్యాడు.

అంతేకాకుండా.. ఈ మధ్య తెలుగులో హిట్ అయిన 'మర్యాద రామన్న' సినిమాను తమిళ్లో 'వల్లవనుక్కం పుల్లమ్ ఆయుథం' పేరుతో రీమేక్ చేసి హీరోగా సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా హిట్ తో సంతానం కెరీర్ సక్సెస్ జంక్షన్ లో ఆగింది. మరి ఈ నేపథ్యంలో హీరోగా వచ్చే అవకాశాలతో బిజీ అవుతాడా లేక తనకున్న స్టార్ కమెడియన్ స్టేటస్ ని కంటిన్యూ చేస్తాడా అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. హీరోగా బిజీ అయ్యి కమెడీకి దూరం అయిన సునీల్ ఇప్పుడు హీరో స్టేటస్ మెయిన్ టైన్ చేయడానికి తెగ కష్టపడుతున్నాడు. మరి 'సంతానం' ఏం చేస్తాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles