Balakrishna new movie title godse

Balakrishna new movie title Godse, Balakrishna New Movie title Godse, Godse is the final title for balakrishna, balayya in godse movie, Balayya movie title is Godse

Balakrishna new movie title Godse, Balakrishna New Movie title Godse, Godse is the final title for balakrishna, balayya in godse movie, Balayya movie title is Godse

గాడ్సే గా వస్తున్న బాలయ్య

Posted: 05/14/2014 01:18 PM IST
Balakrishna new movie title godse

నందమూరి నటసింహం బాలక్రిష్ణ ఇటీవల నటించిన ‘లెజెండ్ ’ సినిమా భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో ఎన్నికల్లో హిందూపురం నుండి పోటీ చేసి ఉత్సాహంగా ప్రచారం నిర్వహించిన ఈ నటసింహం ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటూ, ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.

ఈ ఫలితాలతో సంబంధం లేకుండా బాలయ్య తన తదుపరి సినిమా కోసం సిద్దం అవుతున్నాడు. ఈయన నూతన దర్శకుడు సత్యదేవ దర్శకత్వంలో రుద్రపాటి రమణారావు నిర్మించబోతున్న సినిమాలో నటించబోతున్నాడు.  ఈ సినిమాకు టైటిల్ గా ‘గాడ్సే ’ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. భారత దేశ జాతిపిత అయిన గాంధీజీని హత్య చేసిన వ్యక్తి పేరును బాలయ్య తన సినిమా టైటిల్ గా పెట్టుకుంటే ఫ్యాన్స్, తెలుగు సినీ జనాలు ఆదరిస్తారో లేక  రాద్దాంతం చేస్తారో చూడాలి.

అన్నట్లు ఈ సినిమా షూటింగు జూన్ 10న ఈ సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ గా అంజలి పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. గతంలోనే బాలయ్య సినిమాను రిజెక్ట్ చేసిన ఈ సీతమ్మ ఈసారి ఒప్పుకుంటుందో లేదో చూడాలి. ఆమె కాదంటే శ్రేయాను తీసుకునే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles