Nandini reddy hold nithiin project

Filmmaker Nandini Reddy, Nandini Reddy hold Nithiin Project, Nandini Reddy hold Nithiin movie, state bifurcation

Filmmaker Nandini Reddy, who was to start working on a Telugu project with actor Nithiin Reddy, has put it on hold.

రాష్ట్ర విభజన నితిన్ చావుకొచ్చింది

Posted: 05/01/2014 07:54 PM IST
Nandini reddy hold nithiin project

రాష్ట్ర విభజన అంశం తెలుగు సినిమా ఇండస్ట్రీకి, ముఖ్యంగా తెలంగాణకు చెందిన హీరోలకు పెద్ద తలనొప్పే తీసుకొని వచ్చే విధంగా కనిపిస్తుంది. ఇటీవలి కాలంలో మంచి ఫాంలో నితిన్ తో దర్శకురాలు నందినీరెడ్డి ఓ చిత్రాన్ని ప్లాన్ చేసింది. దానికి సంబంధించిన కథా చర్చలు కూడా పూర్తయ్యాయి.

సెట్స్ కి వెళ్లడమే ఆలస్యం. అంతలోనే ఈ సినిమాకు బ్రేకులు పడ్డాయి. దీనికి ఏవేవో కారణాలు ఇండస్ట్రీ నుండి వినిపించినా, తాజాగా దర్శకురాలు నందినీరెడ్డి స్పందిస్తూ... నితిన్‌తో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేసుకున్నాం. అంతా ఓకే అయింది. అయితే రాష్ట్ర విభజన కారణంగా ఈ సినిమాను ఆపాల్సిన పరిస్థితి ఏర్పడింది. సినిమా మొదలు పెడితే అనేక ట్యాక్స్ సమస్యలు వస్తాయని అర్థమైంది.

అందుకే ఈ సినిమాను కేన్సిల్ చేసుకున్నామని వెల్లడించింది. అయితే ఇండస్ట్రీ నుండి మాత్రం వినిపిస్తున్న వార్త ప్రకారం నందినీరెడ్డి తెలంగాణకు చెందిన హీరో కాబట్టే ఆయనతో సినిమా బ్రేకప్ చేసుకుందని, ఇప్పుడు ట్యాక్స్ సమస్యలు వస్తాయని ఏదో కహాని చెబుతుందని అంటున్నారు. ఏది ఏమైనా రాష్ట్ర విభజన అంశం నితిన్ ప్యాకప్ చెప్పేలా చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles