2 crore for a chase in ravi teja power

Ravi Teja Power movie, ajay,allan amin,dhoom,hansika motwani,power,rang de basanti,ravi teja,regina cassandra,rockline venkatesh,sampath raj,subba raju

The chase sequence will be directed by the Allan Amin The makers of upcoming Telugu action film Power.

ఒక్క సీన్ కోసం 2 కోట్లు... అదీ ‘పవర్ ’

Posted: 04/28/2014 02:46 PM IST
2 crore for a chase in ravi teja power

టాలీవుడ్ మాస్ రాజా రవితేజ ‘బలుపు ’ సినిమా హిట్ తర్వాత కేఎస్ రవీంద్రనాథ్ దర్శకత్వంలో ‘పవర్ ’ ఫుల్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ ఫైట్ సన్నివేశం కోసం ఏకంగా రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారట. త్వరలో బ్యాంకాక్ లో చిత్రీకరణ జరుపుకోబోయే ఈ సన్నివేశం కోసం బాలీవుడ్ స్టంట్ మాస్టర్ అలన్ అమీన్ దీనికి కొరియోగ్రఫీ చేయబోతున్నాడని దర్శకుడు తెలిపాడు.

ధూమ్, రంగ్ దే బసంతి లాంటి చిత్రాలకు కొరియోగ్రఫీ చేసిన అలన్ అమీన్ తో ప్రత్యేకంగా ఈ ఫైట్స్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారట. మే 3 నుంచి 10వ తేదీ వరకు షూటింగ్ జరుపుకోనున్న ఈ షెడ్యూల్లో  రవితేజ, అజయ్, సంపత్ రాజ్, సుబ్బరాజు తదితరులు పాల్గొంటారు. హన్సిక, రెజినా కాసండ్రా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రాక్లైన్ వెంకటేష్ నిర్మిస్తున్నారు. రవితేజ మార్కెట్ ని మించి ఖర్చు పెడుతున్న ఈ సినిమా హిట్టయితే ఓకే కానీ, అందులో ‘పవర్ ’ లేకపోతే మాత్రం పెట్టిన డబ్బులు రావడం కష్టమే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles