Rajini sought rajamouli nod to see baahubali shooting

rajinikanth, ss rajamouli, baahubali, vikramasimha, ajnikanth, baahubali, ss rajamouli, deepika padukone, jackie shroff, r sarath kumar, aadi pinisetty, nasser, shobana

superstar Rajinikanth sought SS Rajamouli permission to visit the shooting of his Telugu period-drama Baahubali.

‘బాహుబిలి ’ సినిమాలో రజినీకాంత్

Posted: 04/21/2014 01:36 PM IST
Rajini sought rajamouli nod to see baahubali shooting

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్, టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న భారీ బడ్జెట్ సోషియోఫాంటసీ సినిమా ‘బహుబలి ’ కి తన వంతుగా మాటలు అందివ్వబోతున్నాడా ? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. ఇటీవల రాజమౌళి రజినీకాంత్ నటించిన ‘కొచ్చాడయాన్ ’, తెలుగులో  ‘విక్రమ సింహా ’ ట్రైలర్ విడుదల కార్యక్రమానికి గెస్ట్ గా వెళ్లి, అక్కడ రజినీకాంత్ ని కలుసుకొని పలు విషయాల పై పిచ్చా పాటిగా మాట్లాడుకున్నారు.

అదే సమయంలో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కు కూడా ‘బాహుబలి ’ షూటింగ్ చూడాలని ఉందని, బహుబలి సెట్ కి రావాలని అనుకుంటున్నానని స్వయంగా రజినీ అడగటంతో జక్కన్న ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ విషయాన్ని రాజమౌళి ట్విట్టర్ లో తెలియజేస్తూ... రజినీ సార్ నన్ను అలా అడటం... నా జీవితంలో మరచిపోని సంఘటనల్లో ఒకటని తెలియజేశాడు. ట్రైలర్ విడుదల కార్యక్రమంలోనే రాజమౌళి బాహుబలి సినిమాకి మాటలు ఇవ్వాలని కోరాడని, దానికి రజినీకాంత్ కూడా సానుకూలంగానే స్పందించినట్లు చెబుతున్నారు సినీ వర్గాల వారు.

రాజమౌళి త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని చిత్ర యూనిట్ అంటుంది. మొత్తానికి రాజమౌళి తనకు అందివచ్చిన అవకాశాలలో దేన్నీ వదలటం లేదని, ఇలా తన సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ పెంచుకుంటున్నాడని అంటున్నారు.  శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో ఇప్పటికే అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ చిత్రాన్ని 2015లో విడుదల చేయనున్నారు. సో.. రజినీ త్వరలో బహుబలి సెట్లో ప్రత్యక్షం కాబోతున్నాడన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles