Balakrishna 100th movie with boyapati srinu

Balakrishna 100th Movie with Boyapati Srinu, Balakrishna 100th movie director, Boyapati Srinu balakrishna combination again,

Balakrishna 100th Movie with Boyapati Srinu, Balakrishna 100th movie director, Boyapati Srinu balakrishna combination again,

బాలయ్య వందో సినిమా బోయపాటికే

Posted: 04/07/2014 04:31 PM IST
Balakrishna 100th movie with boyapati srinu

బాలయ్య వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు మాస్ దర్శకుడు బోయపాటి శీను ‘సింహా ’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని ఇవ్వడమే కాకుండా, బాలక్రిష్ణ ఇమేజ్ కి తగ్గట్లు రెండు యాక్షన్ సినిమాలు తీసి, ఇదీ బాలయ్య పవర్ అని నిరూపించడమే కాకుండా, ఆయన కెరియర్లో లేని, రాని కొత్త కొత్త రికార్డులన్ని జత చేసిన బోయపాటికి బాలయ్య మరో సువర్ణమైన అవకాశాన్ని ఇచ్చినట్లు సమాచారం.

తన కెరియర్లో ఓ మైలు రాయిగా మిగిలిపోయే 100 చిత్రం దర్శకుడిగా బోయపాటినే ఎన్నుకున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశాన్ని పీవీపీ సినిమా అధినేత పొట్లూరి వి.ప్రసాద్ కు బాలయ్య ఇచ్చినట్టు సమాచారం. ‘సింహా ’ ముందు బాలయ్య వేరు... సింహా తరువాత బాలయ్య వేరు అని నిరూపించిన బోయపాటి బాలయ్యను ఎలా చూపించాలో ఆయనకే బాగా తెలుసు.

మూడో సారి రిపీట్ కాబోతున్న ఈ కాంబినేషన్ ఎలాంటి సంచలనాలకు కేంద్ర బిందువు అవుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles