Legend movie 50 cr club soon

legend movie 50 crore club, legend movie, legend collections, legend in 50 crore club, first nandamuri family movie in 50 crore club,telugu films, boyapati seenu,

Nandamuri hero Balayya movie in the 50 crore club soon, Legend movie is going to make the great feat and take the credit for the first time.

యాభై కోట్ల క్లబ్బు దిశగా బాలయ్య

Posted: 04/07/2014 11:24 AM IST
Legend movie 50 cr club soon

భారీ అంచనాల మధ్య విడుదల అయిన ‘లెజెండ్ ’ సినిమా పై  కలెక్షన్ల వర్షం కురుస్తుంది. ఈ సినిమా కొత్త రికార్డులను స్రుష్టించడానికి సిద్దం అవుతుంది. అత్యధిక థియేటర్లలో విడుదల ఈ సినిమా తొలి వారంలో బాలయ్య కెరియర్లో ఇంత వరకు సాధించనంతగా 34 కోట్లు వసూలు చేసి, యాభై కోట్ల క్లబ్బులోకి పరుగులు పెడుతుంది.

తొలి వారం కలెక్షన్ల జోరు చూసిన సినీ విశ్లేషకులు ఈ సినిమా యాభైకోట్లు సాధించడం ఖాయం అని చెబుతున్నారు. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాకు బాలయ్య ఫ్యాన్స్ నుండి విపరీతమైన రెస్పాన్స్ వస్తుండటంతో పాటు, ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలు లేకపోవడంతో ఈ స్థాయి వసూళ్ళు వస్తున్నాయని అంటున్నారు.

ఒకవేళ విశ్లేషకుల అంచనా నిజమై 50 కోట్ల కబ్బులో చేరితే నందమూరి వంశంలో ఇంత భారీ వసూళ్లు సాధించిన తొలి హీరో బాలక్రిష్ణే అవుతాడు. ‘లెజెండ్ ’ మూవీ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందగా... తొలిసారి పూర్తి విలన్ పాత్రలో జగపతిబాబు నటించాడు. సోనాల్ చౌహాన్, రాధికా ఆప్టే హీరోయిన్లుగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కూడా  ఈ సినిమాకు ప్లస్ పాయింట్ గా చెప్పవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles