Rowdy movie details

Rowdy Movie preview, Ram Gopal Varma, Mohan Babu, Manchu Vishnu, Jayasudha, Siva movie, Rowdy movie Rayalaseema factionalism

Rowdy Movie preview, Ram Gopal Varma, Mohan Babu, Manchu Vishnu, Jayasudha, Siva movie

రేపు విడుదలయ్యే "రౌడీ" వివరాలు

Posted: 04/03/2014 11:04 AM IST
Rowdy movie details

రేపు విడుదలౌతున్న రామ్ గోపాల్ వర్మ రౌడీ చిత్రం గురించి సేకరించిన కొన్ని వివరాలు.

రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో చిత్రీకరించిన సినిమా అయినా, యాక్షన్ సన్నివేశాలు ఉన్నా, దానితో పాటుగా ఈ సినిమాలో వర్మ సెంటిమెంట్ కి కూడా మంచి ప్రాధాన్యనిచ్చారు- ముఖ్యంగా మోహన్ బాబు జయసుధ ల మధ్య అనురాగం. 

గాడ్ ఫాదర్, సర్కార్ లాంటి కథే అయినా రౌడీ లో మోహన్ బాబు పాత్ర విభిన్నమైన రీతిలో తీర్చిదిద్దటం జరిగింది.  11 నిమిషాలపాటు రౌడీలో జరిగే యాక్షన్ సన్నివేశం భారతీయ సినిమాలోనే దీర్ఘమైంది.  ఈ సినిమాలో సైకిల్ ఛైన్ నేపథ్య సంగీతం ద్వారా శివ చిత్రాన్ని ప్రేక్షకులకు గుర్తు చెయ్యటం జరిగింది. 

సినిమా తీసామంటే తీసాం, పూర్తి న్యాయం చేసాం అంతే కానీ, బాక్స్ ఆఫీస్ ఫలితాలను పట్టించుకోను అని అనుకునే అభిప్రాయాన్ని కలిగించే రామ్ గోపాల్ వర్మ రౌడీ ద్వారా ఈసారి తెలుగు ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేసినట్లుగానే కనిపిస్తోంది. 

సినిమా విడుదలకు ముందు ఎవరైనా తన సినిమా గురించి బాగు బాగు అనే చెప్పుకుంటారన్నది నిజమే అయినా, మోహన్ బాబు, వర్మ, విష్ణు మాటలలో నిజాయితీ కనిపిస్తోంది. 

రేపు సినిమా మీద రివ్యూతో మీ ముందుకి మళ్ళీ వస్తాం.......

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles