After 12 years simran to pair up with kamal hassan

kamal hassan, simran, drishyam, Nadia replaced by simran, simran heroine, drishyam malayalam movie,

Simran is likely to pair up with Kamal Hassan in the Drishyam remake.

అత్తను పీకేశారు... సిమ్రాన్ ని పెట్టుకున్నారు

Posted: 02/27/2014 11:23 AM IST
After 12 years simran to pair up with kamal hassan

టాలీవుడ్ లో ఇటీవలే సెంకడ్ ఇన్నింగ్స్ ప్రారంభించి తల్లి, అత్త, అక్క పాత్రల్లో యమ స్పీడుగా దూసుకుపోతున్న నదియా స్పీడుకు బ్రేకులు వేసింది తమిళ ఇండస్ట్రీ. తెలుగులో వివిధ పాత్రలతో ఆకట్టుకుంటున్న అత్త అందాలకు ఫిదా అయిన దర్శకుడు జీతు జోసఫ్  ఈమెను ఏకంగా కమల్ హాసన్ సరసన హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు ప్రకటించాడు. మలయాళంలో హిట్టయిన ‘దృశ్యం ’ని తమిళంలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

తమిళ్  వెర్షన్లో మోహన్‌లాల్ పాత్రలో కమల్ హస్సన్ నటిస్తున్నాడు. కమల్ సరసన తొలుత నదియా హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు చెప్పిన ఆయన ఉన్నట్లుండి ఆమెను పీకేసి కమల్ సరసన సిమ్రాన్ ని తీసుకున్నట్లు ప్రకటించాడు కానీ నదియాను ఎందుకు పీకేశాడో మాత్రం చెప్పలేదు. మిర్చి, అత్తారింటికి దారేది తరువాత మంచి ఫాంలోకి వచ్చిన అత్తకు తమిళ ఇండస్ట్రీ ఇచ్చిన షాక్ గట్టిగానే తగిలిందని అనుకుంటున్నారు.

గతంలో కమల్ హాసన్ తో కలిసి నటించిన సిమ్రాన్ దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత కమల్‌ హస్సన్ తో కలిసి నటిస్తోంది. ఇప్పటికే సెంకడ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సిమ్రాన్ రానున్న కాలంలో నదియా అత్తకు గట్టి పోటీనిచ్చే సూచనలే కనిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles