Charan under trivikram and boyapati direction

Trivikram Srinivas, Boyapati Srinu, Socio Fantasy Films, Mass Masala film,

Charan Under Trivikram and Boyapati Direction. Trivikram Srinivas, Boyapati Srinu, Socio Fantasy Films,

క్లాస్ - మాస్ దర్శకులతో రామ్ చరణ్

Posted: 02/24/2014 04:35 PM IST
Charan under trivikram and boyapati direction

రామ్ చరణ్ తేజ్ ‘ఎవడు ’ సినిమాతో మళ్లీ ఫాంలోకి వచ్చాడు. మాస్ సినిమా తరువాత క్రిష్ణ వంశీ దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత చరణ్ ఎలాంటి సినిమా చేయబోతున్నాడంటే... తన తండ్రికి  కెరియర్లో బ్లాక్ బస్టర్ ఇచ్చిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి ’ లాంటి సోషియో ఫాంటసీ చిత్రంలో నటించాలని అనుకుంటున్నాడట.

ఇప్పటి వరకు మాస్ అండ్ రొమాంటిక్ సినిమాలు చేసిన చరణ్ తనను తాను నిరూపించుకున్నాడు. అలాంటి చిత్రాల్లో కూడా నటిస్తే తన స్టామినా ఏంటో తెలుస్తుందని భావిస్తున్నాడట. కొడుకు అలాంటి చిత్రం చేయడానికి ఆసక్తిగా ఉండటంతో చిరు ఈ బాధ్యతను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి అప్పగించాడట. ఇప్పటికే త్రివిక్రమ్ తయారు చేసిన కథల్లో ఒకటి తండ్రీకొడుకులిద్దరికి పిచ్చ పిచ్చగా నచ్చిందట. చరణ్ కెరియర్లోనే హై బడ్జెట్ గా ఈ చిత్రాన్ని రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

అలాగే చెర్రీ బోయపాటితో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నెల్ అంటున్నారు. ఇందులో పవర్‌ఫుల్ స్టూడెంట్‌గా చెర్రీ నటించే ఈ రివెంజ్ మాస్ మసాలా సబ్జెక్ట్‌ను మెగాస్టార్ చిరంజీవి విన్ని తరువాత ఓకే చేశాడని, దుర్గాఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్. నారాయణ - ఎస్ గోపాలరెడ్డి నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారని అంటున్నారు. గత కొంత కాలం నుండే బోయపాటి దర్శకత్వంలో సినిమా ఉంటుందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. మొత్తానికి చెర్రీ క్లాస్, మాస్ ఆడియన్స్ ని అలరించడానికి సిద్దం అవుతున్నాడన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles