Prakash raj says she acted in heart attack for only puri jagannath

Prakash Raj, puri jagannath, Prakash Raj and Puri jagannath, heart attack movie, heart attack success meet, Badri, Idiot, Amma Nanna O Tamil Ammayi, Pokiri, Ulavacharu Biryani.

prakash raj says she acted in heart attack for only puri jagannath

ప్రకాష్ రాజ్ ఇలాంటి పని కూడా చేస్తాడా?

Posted: 02/19/2014 01:24 PM IST
Prakash raj says she acted in heart attack for only puri jagannath

నటుడు ప్రకాష్ ఇలాంటి పని కూడా చేస్తాడని సినీజనాలకు ఆశ్చర్యం వేస్తుంది.  ఒక దర్శకుడు కోసం  ప్రకాష్ రాజ్  ఉలవచారు బిర్యానీ వదిలి పెట్టి వచ్చారంటేనే మనం అర్థం చేసుకోవాలి. ప్రకాష్ రాజుకు ఆ దర్శకుడిపై ఎంత అభిమానం, గౌరవం,  ప్రేమ, ఉన్నాయో.  

అదీ కూడా  ఒక  టాలీవుడ్ దర్శకుడు కోసం  ప్రకాశ్ రాజ్ ఇలా సాహసం చేయటం చాలా ఆశ్చర్యంగా ఉందని  కోలీవుడ్ బాబులు అంటున్నారు. అసలు విషయం ఏమిటంటే.. దర్శకుడు పూరీ జగన్నాథ్ కోసమే తాను 'హార్ట్ ఎటాక్' సినిమాలో నటించడం జరిగిందని అంటున్నాడు ప్రకాష్ రాజ్. ఈ విషయంపై ఆయన ఈ రోజు ప్రత్యేకంగా మీడియాతో  మాట్లాడుతూ కొన్ని  రహస్యాలను బయట పెట్టారు. 

"నేను ప్రేమించే దర్శకుడు పూరీ జగన్నాథ్. పూరీ నా స్నేహితుడు. బద్రి, ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, పోకిరీ... ఇలా తన ప్రతి సినిమాలోనూ నాకు మంచి పాత్రలిచ్చాడు. అతని సినిమాలలో నటించడాన్ని నా పుణ్యంగా భావిస్తానని  ప్రకాష్ రాజ్ అన్నారు.  

అయితే  ఈరోజు  ఈ స్థాయిలో  ఉండటానికి కారణం  చాలా మంది దర్శకుల ప్రోత్సహం ఉంది.   కానీ అందరికంటే  టాలీవుడ్ దర్శకుడు పూరీ అంటే చాలా ఇష్టం అని ప్రకాష్ రాజ్ అన్నారు. 

పూరీ తీసే  ప్రతి సినిమాలో.. నాకు క్యారెక్టర్  ఇస్తాడు.  సినిమా కోసం ముందుగానే  నాకు ఫోన్ చేసి చెప్పటం జరుగుతుంది. అయితే రీసెంట్ గా తీసిన హార్ట్ ఎటాక్  సినిమా కోసం నాకు  ఫోన్ చేయటం జరిగింది. ఆ సమయంలో  నేను ‘ఉలవచారు బిర్యానీ ’ షూటింగు కోసం మైసూరులో ఉన్నాను. 

 పూరీ ఫోన్లో  రెండు రోజు వచ్చి నటించి వెళ్లమని  అడిగాడు. అంతే  నేను ఉలవచారు బిర్యానీ  షూటింగు ఆపేసి, వెంటనే  హైదరాబాద్ కు వచ్చిన నటించారు. ఇది కేవలం  దర్శకుడు పూరి కోసమే ఇలా నటించానని  నటుడు  ప్రకాష్ రాజ్ చెప్పటం జరిగింది. 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles