High budget for balakrishna legend movie

alakrishna Legend movie budget is 40 crores. balakrishna legend budget, 14 reels entertainment, radhika apte, sonal chauhan

alakrishna Legend movie budget is 40 crores. balakrishna legend budget, 14 reels entertainment, radhika apte, sonal chauhan

బాలయ్య సినిమాకు అంత మార్కెట్ ఉందా ?

Posted: 02/15/2014 09:58 AM IST
High budget for balakrishna legend movie

నందమూరి నట సింహం బాలయ్య, బోయపాటి శీను కాంబినేషన్లలో తెరకెక్కుతున్న ‘లెజెండ్ ’ చిత్ర బడ్జెట్ పై ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ హాట్ గా చర్చించుకోవడమే కాకుండా ఆయన కెరియర్లోనే ఇంత భారీ బడ్జెట్ తో నిర్మితమౌవుతున్న ఈ సినిమాకు వచ్చే వసూళ్ళ సాధ్యసాధ్యాల పై లెక్కలేస్తున్నారు.

14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దాదాపు 40 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టినట్లు సమాచారం. ఈ సినిమా బడ్జెట్ ప్రస్తుతం యంగ్ హీరో సినిమాల బడ్జెట్ తో సమానం. మరి ఇంత మార్కెట్ బాలయ్య సినిమాకు ఉందా ? ఏ కాన్ఫిడెంట్ తో నిర్మాతలు ఇంత ఖర్చు చేస్తున్నారట అంటే... ఇప్పటికే బోయపాటి - బాలయ్య కాంబినేషన్లో వచ్చిన ‘సింహా ’సినిమా మంచి విజయాన్ని సాధించడం, మళ్లీ వీరి కాంబినేషన్లో ‘లెజెండ్ ’ తెరకెక్కుతుండటంతో బిజినెస్ పరంగా ఢోకా ఉండదని అంచనాలు వేస్తున్నారు.

భారీ క్యాస్టింగ్, భారీ లొకేషన్ల విషయంలో ఏ మాత్రం రాజీ పడటం లేదట. ప్రస్తుతం దుబాయ్ లో షూటింగు జరుపుకుంటున్న ఈ చిత్రం ఆడియోను  మార్చి 7 న శిల్పకళా వేదికలో విడుదల చేయాలని దర్శక,నిర్మాతలు ఫిక్స్ అయినట్లు సమాచారం. అలాగే చిత్రం ఫస్ట్ టీజర్ ని కూడా అతి త్వరలో లాంచ్ చేస్తారు. అలాగే మార్చి 28న గానీ, లేదంటే ఏప్రిల్‌ 4న గానీ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. చూద్దాం బాలయ్య ‘లెజెండ్ ’ వసూళ్ళలో ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles