Hero nani too starts using pawan kalyan

pawan klayn, hero nani, nani usting to pawan image, Band Baaja Baaraat Movie, nani latest movie, Pawan Kalyan Dialogues, Nani Aaha Kalyanam Song Lyrics .

Hero nani too starts using pawan kalyan, Pawan Kalyan Dialogues, Nani Aaha Kalyanam Song Lyrics

పవన్ క్లబ్ లో చేరిన హీరో నాని

Posted: 02/07/2014 09:55 AM IST
Hero nani too starts using pawan kalyan

టాలీవుడ్ లో  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్రెండ్  నడుస్తుంది.  టాలీవుడ్ కు ఒక ఐకాన్ గా పవన్ కళ్యాణ్  మారిపోయాడు. ఇప్పుడు చిన్న, పెద్ద అని తేడా లేకుండా  అందరు  పవన్ కళ్యాణ్ జపం చేస్తున్నారు.  పవన్ కళ్యాణ్  ఇమేజ్ ను వాడుకుంటున్నారు రోజు రోజుకి  ఎక్కువుతున్నారు.   పవన్ కళ్యాణ్  డైలాగ్, ఆయన పాట, ఆయన స్టైల్,    పవన్ పేరు, లేకపోతే  ఆయన్ని ఆడియో పంక్షన్ కి పిలవటం లాంటివి టాలీవుడ్ లో తరుచుగా జరుగుతున్నాయి.  ఇలాంటి వాటికి ముందుగా దారిచూపించింది హీరో  నితిన్.   

పవన్ కళ్యాణ్ పై అభిమానం తో .. నితిన్  పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను  వాడుకోవటం జరిగింది. అది ఇప్పుడు అందరికి  ఒక టానిక్ మాదిరిగా ఉపయోగపడుతుంది.  కొంతమంది దర్శకులు, నిర్మాతలు  పవన్ కళ్యాన్ గురించి మాట్లాడటం అవకాశం వస్తే.. నాన్ స్టాప్ గా మాట్లాడుతుంటారు. కానీ పవన్ కళ్యాణ్  ఇలాంటి వాటిని అసలు పట్టించుకోడనే  విషయం అందరికి తెలిసిందే.  అయితే ఇప్పుడు లేటస్ట్ గా హీరో నాని కూడా  పవన్ క్లబ్ లో చేరిపోయాడు. బాలీవుడ్ సినిమా 'బ్యాండ్ బాజా బారాత్'కు అధికారిక రీమేక్ అయిన 'ఆహా కల్యాణం'లో నాని హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. 

ఇది తమిళ, తెలుగు భాషల్లో తయారవుతోంది. ఈ చిత్రంలో ఓ పాట డైలాగులతో ఉంటుంది. ఆ డైలాగులలో మొదట 'నాకు కొంచెం తిక్క ఉంది, దానికో లెక్క ఉంది, ..' అని వస్తుంది. తర్వాత లైన్ లో 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాథ్ ' అనే డైలాగు వస్తుంది. బాగా పాపులర్ అయిన ఈ రెండు డైలాగులు పవన్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటాయని భావిస్తున్నారు.  దీనిని బట్టి  పవన్ కళ్యాణ్  ఇమేజ్ ను మన టాలీవుడ్ హీరోలు  ఎలా ఉపయోగించుకుంటున్నారో అర్థమవుతుంది.   

-ఆర్ఎస్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles