14 reels 80 crores offer to pawan kalyan

14 Reels 80 crores offer , Pawan Kalyan, Mahesh babu, 1 Nenokkadine, Gabbar Singh 2, Dookudu, 14 Reels, pawan to tie-up with 14 reels, 14 Reels Entertainment, pawan kalyan with 14 reels, 14 reels to direct pawan kalyan, pawan kalyan in 14 reels banner, pawan kalyan next movie in 14 reels banner

14 Reels Entertainment is planning to give Rs.80 crores to the star for two movies under their banner.

పవన్ తో భారీ కాంట్రాక్ట్ కుదుర్చుకుందా ?

Posted: 02/05/2014 08:47 PM IST
14 reels 80 crores offer to pawan kalyan

ఇటీవలి కాలంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి భారీ కాంట్రాక్టులు కుదుర్చుకొని వారితో వరుసగా సినిమాలు చేసేస్తున్నారు. పాత కాలంలో కూడా ఈ ట్రెండ్ ఉండేది. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ తో విజయా ప్రొడక్షన్స్ వారు కాంట్రాక్టు కదుర్చుకొని వరుస సినిమాలు చేశారు.

ప్రస్తుతం భారీ నిర్మాణ సంస్థలుగా పేరొందిన పీవీపీ, 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు స్టార్ హీరోలు అయిన మహేష్ తో , పవన్ తో డీల్ కుదుర్చుకుంటున్నాయి. ఇఫ్పటికే 14 రీల్స్ సంస్థ మహేష్ తో, పీవీపీ సంస్థ పవన్ తో డీల్ కుదుర్చుకున్నట్లు వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

ఇఫ్పుడు తాజాగా వినిపిస్తున్న వార్త ప్రకారం 14 రీల్స్ సంస్థ పవన్ కి 80 కోట్ల భారీ ఆఫర్ ఇచ్చిందని, ఈ డీల్ లో భాగంగా పవన్ ఆ సంస్థలో రెండు చిత్రాలు చేయాలనే ఒప్పందంలో పాటు, వన్ కళ్యాణ్ కి పూర్తి స్వేచ్చ ఇచ్చేలా,దర్శకుడు...కథ అన్నీ ఆయనే పైనలైజ్ చేసుకునేలా ఆ డీల్ ప్రపోజ్ చేసారని దానికి పవన్ కళ్యాణ్ ఎటువంటి సిగ్నల్స్ ఇవ్వలేదని అంటున్నారు.

ఒకవేళ పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ‘గబ్బర్ సింగ్ -2 ’ తరువాత వరుసగా రెండు చిత్రాలు తెరకెక్కించాలనే ప్లాన్ లో ఉన్నారట ఆ సంస్థ వారు. ప్రస్తుతం భారీ సినిమాలు చేస్తున్న ఆ సంస్థ మరికొందరు స్టార్స్ తో డీల్ కుదుర్చుకునే పనిలో ఉందట. ఇంత భారీ ఆఫర్ కి పవన్ ఎలాంటి సిగ్నల్ ఇస్తాడేమోనని అభిమానులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles