Young tiger ntr to start own banner

Jr Ntr planning to launch own banner, jr ntr to start productions, jr ntr to launch production house, jr ntr own banner

young tiger ntr to start own banner. Jr Ntr planning to launch own banner, jr ntr to start productions, jr ntr to launch production house

సొంత బ్యానర్ నెలకొల్పే ఆలోచనలో ఎన్టీఆర్

Posted: 01/30/2014 10:14 AM IST
Young tiger ntr to start own banner

టాలీవుడ్ లో ప్రముఖ దర్శకులు, హీరోలు సొంత ప్రొడక్షన్ సంస్థలు నిర్మించుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే చాలా మంది హీరోలకు సొంత బ్యానర్లు ఉండగా, ఇటీవలి కాలంలో ప్రముఖ దర్శకులుగా పేరొందిన పూరి జగన్నాథ్, సుకుమార్, సంపత్ నంది, త్రివిక్రమ్ లాంటి లాంటి వాళ్ళు సొంత బ్యానర్లు పెట్టి చిన్ని సినిమాలు నిర్మించాలనే ఆలోచన చేస్తున్నారు.

పూరి ఇప్పటికే ‘హార్ట్ ఎటాక్ ’ సినిమాను తన బ్యానర్లో నిర్మించాడు. ఇప్పుడు స్టార్ హీరో యంగ్ టైగర్ కూడా ఓ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేయడానికి రెడీ అయ్యినట్లు సమాచారం. ఇప్పటికీ ఎలాంటి నిర్మాణ సంస్థ లేని ఎన్టీఆర్ సొంత బ్యానర్ లో చిన్న చిత్రాల నుండి భారీ బడ్జెట్ చిత్రాలను సైతం తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నాడట. ఎన్టీఆర్ త్వరలో ‘మిర్చి ’ ఫేం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.

ఈ చిత్రాన్ని తన సొంత బ్యానర్లోనే నిర్మించే ఆలోచన చేస్తున్నాడట. తన సొంత బ్యానర్లో తన సినిమానే చేస్తే ఒకవేళ సినిమాకు బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు రాకపోయినా పెద్దగా వచ్చే నష్టం ఏమీ ఉండదనే భావించే ఆ దిశగా ఆలోచన చేస్తున్నాడని అంటున్నారు. హీరోగా సక్సెస్ అయ్యిన ఎన్టీఆర్ నిర్మాతగా ఏ మేరకు సక్సెస్ అవుతాడో చూద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles