Ramcharan greensignal to boyapati srinu movie

Ramcharan under Boyapati Srinu, Ramcharan Boyapati Srinu movie, charan greensignal to Boyapati Srinu, Ramcharan and Boyapati Srinu Movie updates, Ramcharan and Boyapati Srinu news

Ram Charan will be working with the Legend director Boyapati Srinu soon.

లెజెండ్ దర్శకుడితో... రామ్ చరణ్

Posted: 01/22/2014 06:53 PM IST
Ramcharan greensignal to boyapati srinu movie

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్న మాస్ హీరో ఎవరంటే రామ్ చరణే అంటున్నారు. ఇటీవలి కాలంలో ఆయన నటించిన మాస్ సినిమాలు మంచి హిట్టుకొట్టడమే దీనికి కారణం. ఇటీవల వచ్చిన ‘ఎవడు ’ సినిమా మంచి హిట్ కొట్టడమే కాకుండా, యాభై కోట్ల క్లబ్ కి దగ్గరగా దూసుకుపోతుంది.

దీంతో చరణ్ మరో మాస్ మసాలా సినిమాలని డిసైడ్ అయ్యినట్లు సమాచారం. ఇందులో భాగంగానే మాస్ అండ్ కమర్షియల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న బోయపాటి శీను దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిలిం నగర్ వర్గాల సమాచారం. ఇటీవల బోయపాటి చరణ్ ని కలిసి ఓ కథ వినిపించాడని, అది విన్న వెంటనే చరణ్ మరో మాట లేకుండా ఒప్పుకున్నాడని అంటున్నారు.

ప్రస్తుతం క్రిష్ణ వంశీ తో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమా చేయడానికి సిద్దం అయిన రామ్ చరణ్ దాని తరువాత ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ళేందుకు ప్లాన్ చేస్తున్నాడట. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కితే బోయపాటి కూడా మెగా క్యాంపు దర్శకుల లిస్టులో పడ్డట్లే అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles