పై ఫోటోలో కనిపిస్తున్న వీరంతా రంగురంగుల చొక్కాలు వేసుకొని అదిరే స్టిల్స్ ఇచ్చిన వీరందరు ఎవరో గుర్తు పట్టారా ? 80వ దశకంలో సౌత్ సినిమా ఇండస్ట్రీని తనదైన శైలిలో ఏలిన సూపర్ స్టార్ హీరో, హీరోయిన్లు. వీరంతా ఇటీవల మళయాళం నటుడు మోహన్ లాల్ , సుహాసిని కలిసి ఏర్పాటు చేసిన పార్టీలో ఇలా కలిసి ఫుల్లుగా ఎంజాయ్ చేశారు.
80వ దశకం నుండి నేటి వరకు కూడా వెండితెర పై ప్రేక్షకుల్ని ఏదో విధంగా అలరిస్తున్న వీరు సినిమాలతో, ఇతర వ్యాపకాలతో బిజీగా ఉన్న వీరు ఇలా కలిసి అలనాటి తీపిగుర్తుల్ని గుర్తుచేసుకున్నారు. వందేళ్ళ సినిమా చరిత్రలో ఇలాంటి అపురూప కలయిక ఇదే అనడంలో సందేహం లేదు. స్నేహానికి ప్రతిరూపంగా ఏర్పాటుచేసిన ఈ పార్టీకి మెగాస్టార్ చిరంజీవి, సూపర్‌స్టార్ రజనీకాంత్, మోహన్‌లాల్, అంబరీష్, వెకంటేష్, బాలక్రిష్ణ, సుమన్, అరవింద్ రమేష్, అంబరీష్ , భాను చందర్, అర్జున్, జయరామ్, నరేష్, నటీమణులు సుహాసిని, రాధిక, రమ్యకృష్ణ, ఖుష్బూ, రేవతి, సుమలత, నదియా, రేవతి, మేనక, జయశ్రీ, పూర్ణిమాభాగ్యరాజ్ ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు.
రజినీకాంత్, చిరంజీవి మధ్యలో కూర్చోగా, మిగిలిన నటులు వారి చెంతన చేరి ఇలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చారు. ఈ సందర్భంగా కొన్ని తీర్మానాలు చేసుకున్నారు. మళ్లీ వచ్చే ఏడాది జనవరిలో కలుసుకోవాలనీ, ఈ సారి కమలహాసన్, నాగార్జున కూడా హాజరు కావాలని తారలంతా తీర్మానించారు. ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని సుహాసిని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Jun 01 | బ్రహ్మాస్త్ర ఫిల్మ్‌కు చెందిన కొత్త అప్డేట్ వచ్చింది. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ ఫిల్మ్‌కు చెందిన కొత్త టీజర్‌ను రిలీజ్ చేశారు. ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్‌తో పాటు ఇతర స్టార్స్ ఉన్న ఆ... Read more
Jun 01 | బాలీవుడ్ ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నాథ్ హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 53 సంవత్సరాలు. కేకేగా చిరపరిచితమైన ఆయన కోల్‌కతాలోని నజురుల్ మంచా ఆడిటోరియంలో ప్రదర్శన ఇచ్చారు. కేకే పాటలకు స్టెప్పులేసిన అభిమానులు.. ఆ... Read more
May 30 | కరోనా లాక్ డౌన్ లో వాయిద పడ్డ సినిమాలన్ని వరుస పెట్టి విడుదల అవుతున్నాయి. గతేడాది పుష్ప, అఖండ, శ్యామ్ సింగరాయ్ వంటి సినిమాలు తెలుగు సినీ పరిశ్రమకు ధైర్యాన్ని ఇచ్చాయి. అదే క్రమంలో... Read more
May 30 | ఉప్పెన' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన బేబమ్మగా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పర్చుకన్న మంగళూరు బ్యూటీ కృతిశెట్టి తన కెరీర్ లోనూ విజయాల పరంపరను సోంతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. తొలి... Read more
May 30 | యాక్టింగ్‌లోనే కాదు సినిమా ప్రమోషన్లలోనూ తన దారి సపరేటు అని నిరూపించారు ప్రముఖ నటుడు, టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌బాబు. తాను నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యానని చెప్పిన మహేశ్ బాబు.. త్వరలో విడుదల కానున్న... Read more