Emraan hashmi son ayan suffering with cancer

Emraan Hashmi, Bollywood, Ayaan, ahesh bhatt, emraan hashmi, ayan hashmi

Emraan Hashmi four-year-old son Ayan has been diagnosed with first-stage cancer.

ఇమ్రాన్ హష్మి కొడుక్కి క్యాన్సర్

Posted: 01/15/2014 05:20 PM IST
Emraan hashmi son ayan suffering with cancer

ఇమ్రాన్ హష్మీ... ఈయన పేరు వింటేనే బాలీవుడ్ హీరోయిన్లకు హడల్. ఈయనిచ్చే మూతి మద్దులకు వారి పెదాలు అదిరిపోవాల్సిందే. అలాంటి ఇమ్రాన్ హష్మీకి ఇప్పుడు కొండంత కష్టం వచ్చి పడింది. ఈయనెంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తన నాలుగేళ్ళ కుమారుడు అయాన్ ని క్యాన్సర్ మహమ్మారి వెంటాడుతుంది.

అయాన్ కి కిడ్నీల్లో ట్యూమర్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం తొలి దశలో ఈ వ్యాధి ఉన్నట్లు వైద్య పరీక్షలు నిర్వహించిన తరువాత డాక్టర్లు చెప్పినట్లు ప్రముఖ దర్శక నిర్మాత, ఇమ్రాన్ ఫ్రెండ్ మహేష్ భట్ తెలిపారు. అయాన్ కి హిందూజా గ్లోబల్ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు చేసినట్లు తెలిపారు. అయాన్ కి వెంటనే సర్జరీ చేయాలని, కీమో థెరపీ ద్వారా కూడా దీన్ని నయం చేయవచ్చునని డాక్టర్లు చెప్పారు.

ప్రస్తుతం విదేశాల్లో షూటింగులో ఉన్న ఇమ్రాన్ ఈ వార్త విని ఒక్కసారి షాక్ కి గురయ్యారు. ఇంత చిన్న వయస్సులో తన కుమారుడికి ఈ వ్యాధి రావడంతో ఇమ్రాన్ తట్టుకోలేక పోతున్నాడు. ఈ వార్త తెలిసిన వెంటనే తను నటిస్తున్న సినిమా దర్శక నిర్మాతలను షెడ్యూల్ కాన్సిల్ చేసుకోవాల్సిందిగా కోరాడు. దుర ద్రుష్టం కొద్ది వచ్చిన ఈ వ్యాది నుండి అనయాన్ తొందరగా కోలుకోవాలని కోరుకుందాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles