Ram charan yevadu movie highlights

Ram charan yevadu movie highlights, ramcharan yevadu movie review,ramcharan yevadu review,ramcharan yevadu highlights,ramcharanyevadu preview

Ram charan yevadu movie highlights, ramcharan yevadu movie review,ramcharan yevadu review,ramcharan yevadu highlights,ramcharanyevadu preview

‘ఎవడు ’ పై అంచనాలు పెంచేస్తున్నారు

Posted: 01/03/2014 06:00 PM IST
Ram charan yevadu movie highlights

సినిమా షూటింగు పూర్తి చేసుకొని దాదాపు నెలలు గడుస్తూ ఉన్నా ఇంత వరకు విడుదలకు నోచుకోలేదు. అదే ‘ఎవడు ’ సినిమా. ఈ సినిమా నిర్మాత వల్లనో లేక దర్శకుడి వల్లనో ఆగిపోలేదు. రాష్ట్ర పరిస్థితుల నేపధ్యంలో వాయిదా పడిన ఈ సినిమా పెట్టిన పెట్టుబడి తిరిగి తెచ్చుకోవడానికి సరైన సమయంలో విడుదల చేయాలని చూస్తున్నారు.

అన్నీ కలిసి వస్తే ఈ సినిమా ఇప్పటి విడుదలై తెర మరుగు అయ్యేది. కానీ విడుదల కాకుండా దీన్ని ప్రేక్షకులు మరచి పోకుండా చిత్ర యూనిట్ సభ్యులు అప్పుడప్పుడు దీనికి సంబంధించిన ట్రైలర్స్ ని వదులుతున్నారు. ఎలాగు రామ్ చరణ్ సినిమా కాబట్టి ఫ్యాన్స్ కూడా రోజు రోజుకు అంచనాలు పెంచేసుకుంటున్నారు. కాదు కాదు సినిమా యూనిట్ వాళ్ళే పెంచేస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమాను మెగా ఫ్యామిలీతో పాటు ఇంకొంత మంది చూశారట.

ఈ సినిమా చూసిన చిరు ఫస్టాఫ్ కన్నా సెకండాఫ్ పై సంత్రుప్తి వ్యక్తం చేశాడట. ఈ సినిమాలో హైలెట్స్ గురించి ఫిలిం నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. సెకండాఫ్ లో పాటలు, వాటిలో రామ్ చరణ్ డ్యాన్స్ లు, క్లయిమాక్స్ అరగంటా చరణ్/అర్జున్ ల మల్టీ ఫ్రేమింగ్ చాలా అద్భుతంగా ఉన్నాయని, సినిమా మగధీర రేంజ్ లో హిట్టవుతుందని, సినిమాలో సహజ నటి జయసుధ క్యారెక్టర్ తో పాటు, మిగతా వారి నటన కూడా బాగుందని టాక్ రావడంతో దిల్ రాజు ముఖంలో మళ్లీ ఆనందం కనిపిస్తోంది.

ఆ ఆనందంతోనే సినిమాకు ఒక రోజు ముందు ప్రివ్యూ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈనెల 12 తేదీన రానున్న ఈ సినిమా పై చిత్ర యూనిట్, చరణ్ కుటుంబ సభ్యులు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles