Aditya chopra and rani mukerji to wed feb 10

Aditya Chopra and Rani Mukerji, Rani Mukerji wed with Aditya Chopra, Umaid Bhawan, Jodhpur, February 10 2014, wedding celebrations

Aditya Chopra and Rani Mukerji have not only finalised a date for their wedding, they have also chosen the venue.

ఆదిత్య చోప్రాతో మూడు ముళ్ళు వేయించుకుంటుంది

Posted: 12/31/2013 03:03 PM IST
Aditya chopra and rani mukerji to wed feb 10

ప్రముఖ బాలీవుడ్ చిత్రాల నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆదిత్య చోప్రా త్వరలో బాలీవుడ్ భామ రాణిముఖర్జీ మెడలో మూడుముళ్ళు వేయబోతున్నాడని బాలీవుడ్ లో వార్తలు వెలువడుతున్నాయి. వీరిద్దరి మధ్య గత కొంత కాలం నుండి ఎఫైర్ నడుస్తుంది.

గతంలోనే వీరిద్దరు వివాహం చేసుకోవాల్సి ఉన్నా యశ్ చోప్రా మరణంతో అది వాయిదా పడిందని, వీరి వివాహం ఫిబ్రవరి 10, 2014న జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్‌లో గ్రాండ్‌గా జరుగనున్నట్లు తెలుస్తోంది.

గత సంవత్సరం జులైలోనే వీరి ఎంగేజ్ మెంట్ అంత్యంత సన్నిహితుల మధ్య జరిగిందని, ఆ వార్తలకు బలం చేకూరేలా రాణి ముఖర్జీ చేతికి ఖరీధైన ఉంగరం ఉండటమే కారణం అని అంటున్నారు బాలీవుడ్ జనాలు. గత కొంత కాలంగా కలిపి ఉంటుంటున్న వీరి పట్ల కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా ఉండటంతో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనకు వచ్చినట్లు చెబతున్నారు. పెళ్లి విషయంలో ఇంత వరకు ఎటువంటి ప్రకటన రాలేదు.

మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో కానీ బాలీవుడ్ వీరికి పెళ్ళి అవుతుందని కోడై కూస్తుంది. ప్రస్తుతం యష్ రాజ్ సంస్థ ‘ధూమ్ 3 ’ చిత్రాన్ని నిర్మించింది. ఇప్పుడు ఆ సినిమా భారీ కలెక్షన్లతో దూసుకుపోతూ 500 కోట్ల మార్కను అందుకునే ప్రయత్నం చేస్తుంది. అదే జరిగితే బాలీవుడ్ లో కొత్త రికార్డు క్రియేట్ చేసినట్లవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles